టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ బాహుబలి2. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు సైతం ఊపందుకున్నాయి. ఇప్పటికే బాహుబలి2 మూవీకి సంబంధించిన ప్రధాన సీక్వెన్స్ లకి సిజి పనులు పూర్తి కావస్తున్నాయి.


ఇదిలా ఉంటే ఈ మూవీ ఎప్పడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో రాజమౌళి గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. కానీ దీన్ని రాజమౌళి అఫీషియల్ గా మాత్రం చెప్పటంలేదు. అయితే, బాహుబలి వంటి రీజనల్ మూవీని ఇంటర్నేషనల్ లెవల్ లో రిలీజ్ చేసి సక్సెస్ సాధించటం వెనుక బాలీవుడ్ ప్రొడక్షన్ సంస్థ అయిన ధర్మ ప్రొడక్షన్స్ ది కీలక భాగం.


ధర్మ ప్రొడక్షన్ అధినేత అయిన కరణ్ జోహార్ ఇప్పుడు కూడ బాహుబలి2 కోసం పని చేస్తున్నాడు. దీంతో బాహుబలి2 మూవీ మార్కెట్ కచ్ఛితంగా 1000 కోట్ల రూపాయలను కొల్లగొడుతుందనేది ఇండస్ట్రీ మార్కెట్. ఇక్కడ బాహుబలి2 కోసం ఖర్చు పెట్టేది 180 కోట్ల రూపాయలు. దీనిని టేబుల్ ప్రాఫిట్ తో రిలీజ్ చేస్తే వచ్చే మార్కెట్ 700 కోట్ల రూపాయలు అనేది కరణ్ జోహార్ లెక్క. ఇక థియోటర్స్ లో రిలీజ్ తరువాత వచ్చే కలెక్షన్స్ 900-1000 కోట్ల వరకూ ఉంటుందనేది ట్రేడ్ రిపోర్ట్స్ సైతం చెబుతున్నాయి.


దీంతో బాహుబలి2 ని ఏరకంగా చూసుకున్నా నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలే. అయితే బాహుబలి2 కి ఇంటర్నేషనల్ మార్కెట్ ని తీసుకురావాలంటే కరణ్ జోహార్ అందుకు భారీగా డిమాండ్ చేస్తున్నారు. కరణ్ జోహార్ కి బాలీవుడ్ మార్కెట్ తో పాటు, ఇంటర్నేషనల్ మార్కెట్ రైట్స్ ని ఇస్తే బాహుబలి2 నిర్మాతకి 50 కోట్ల రూపాయల తేడా వస్తుంది.


కరణ్ జోహార్ ని కాదని ఇతర సంస్థలకి ఇస్తే... బాహుబలి2 మూవీ ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో కరణ్ జోహార్ తప్ప బాహుబలి2 నిర్మాతలకి మరో అవకాశం కనిపించటం లేదు. 50 కోట్ల రూపాయల తేడా ఉండటంతో...రాజమౌళికి ఇది నిరుత్సాహాన్ని కలిగిస్తుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: