తెలుగు ఇండస్ట్రీలో గత రెండు సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంపై ఎన్నో ఊహా గానాలు వస్తూనే ఉన్నాయి. చిరంజీవి రాజకీయాల్లోంచి తిరిగి సినిమాల్లో నటించడానికి మక్కువ చూపడంతో తన 150వ చిత్రానికి ముహూర్తం పెట్టారు. అయితే ఇది కాస్తా గత రెండు సంవత్సరాల నుంచి సాగదీస్తూ వస్తూనే ఉన్నారు. మొత్తానికి చిరంజీవి తన పుట్టిన రోజు సందర్భంగా తమిళ సూపర్ హిట్ చిత్రం కత్తి రిమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మంచి సోషల్ మెసేజ్ తో కూడినటువంటి చిత్రాన్ని తీయాలని ఇప్పటికే ఆ చిత్రం స్ట్ర్కీప్ట్ లో ఎన్నో మార్పులు చేర్పులు చేశారట. అయితే ఈ చిత్రానికి వివివివినాయక్ దర్శకత్వం వహిస్తుండగా దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.  

ఇక నిర్మాణ బాధ్యతలు చిరు తనయుడు రాంచరణ్ వహిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్ లో జరుగుతుంది. చిరు 150 వ చిత్రంలో హీరోయిన్  విషయంలో మాత్రం ఇప్పటి వరకు ఎన్నో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి..ఆ మద్య ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్లు  ఈ చిత్రంలో నటించడానికి విముఖత చూపించినట్లు ఆ తర్వాత నయన్, అనుష్క, త్రిషలు కూడా పక్కకు తొలగినట్లు వార్తలు వచ్చాయి. మొత్తానికి చిరు సరసన కాజల్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ మరోవైపు బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే ఫైనల్ చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇప్పుడు మాత్రం మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఇందులో ఓ సాంగ్‌కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేయనున్నాడట.

గతంలో చిరంజీవికి ప్రభుదేవా ఎన్నో హిట్‌సాంగ్స్‌కి డాన్స్ కంపోజ్ చేశాడు. అందులో ఒకటి ఘరానా మొగుడు. ‘బంగారు కోడి పెట్ట’ సాంగ్‌కి ఈయన కంపోజ్ చేసిన డాన్స్ నేటికీ చిరు అభిమానులతో స్టెప్స్ వేయిస్తుంది.  ప్రస్తుతం ప్రభుదేవ దర్శకుడి, నటుడుగా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ప్రభుదేవాతో తన 150 మూవీలో ఓ సాంగ్‌కి కొరియోగ్రఫీ మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుదేవాతో సమావేశం కావడం, ఆయన వెంటనే ఓకే చేయడం అంతా జరిగిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేసిన సాంగ్‌‌కి అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేసే పనిలోపడ్డాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: