బాలీవుడ్లో ఇన్నాళ్లకు రుస్తం సినిమాతో హిట్ అందుకున్న గోవా బ్యూటీ ఇలియానా అమితాబ్, అనీల్ కపూర్ నటిస్తున్న అంఖేన్-2 లో ఉందంటూ ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ రోజు దర్శక నిర్మాతలే ఎనౌన్స్ చేశారు. అయితే అసలు ఈ సినిమా గురించి ఇలియానాతో మాట్లాడలేదట చిత్రయూనిట్. ఖాళీగానే ఉంది కదా మనమే గొప్ప అవకాశం ఇస్తున్నాం కాదంటుందా అన్న తీరున ఇలియానా పేరుని తమ స్టార్ కాస్ట్ క్రూలో మెన్షన్ చేశారు. 


తీరా ఇలియానా ఈ విషయం తెలుసుకుని ఆ చిత్ర దర్శక నిర్మాతల మీద కస్సు బుస్సు లాడుతుంది. తనని అడుగకుండా అలా ఎలా ఓ సినిమా కాస్టింగ్ లో తన పేరు పెడతారని అంటుందట. అంతేకాదు తన అనుమతి లేనిదే పెట్టారంటూ రాద్ధాంతం చేస్తుంది. రుస్తం బీ టౌన్ ఆశలను బ్రతికించేలా చేసింది అందుకే ఇలియానా అంఖేన్-2 అవకాశాన్ని కాదంటుంది అంటున్నారు. ఇన్నాళ్లు అవకాశాల కోసం ఎదురుచూసిన ఈ అమ్మడు ఇప్పుడు అమితాబ్, అనీల్ కపూర్ లాంటి స్టార్స్ ఉన్న సినిమాను కాదనడం బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. 


ఇక ఈ సినిమాలో సౌత్ బ్యూటీ రెజినా కూడా సెలెక్ట్ అవ్వడం విశేషం.  మరి ఎలాగు ఎనౌన్స్ చేశాం కదా అం ఇల్లి బెబ్ ని ఒప్పిస్తారా లేక వేరే భామను తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఈమధ్య అవకాశాల్లేని ఇలియానా ఎలాంటి ఆఫర్ వచ్చినా చేసేద్దాం అనే ఊపు చేసింది. ఇక తనకు స్టార్ ఇమేజ్ తెచ్చిన సౌత్ సినిమాల వైపు కూడా ఓ లుక్ వేసిన ఇలియానా ఇక్కడ సినిమాలకు సడెన్ ఝలక్ ఇచ్చి వెళ్లిందని ఆమెకు అవకాశం ఇవ్వలేదు.


ఇక రుస్తం సినిమా ఒక్కటి ఆమె ఆశ నెరవేరేలా చేసినా మరి ఓ ఆఫర్ వచ్చాక అంఖేన్-2 లో చేసేది లేదని చెబితే బాగుండేది అలా కాకుండా తనను ఏమాత్రం అడుగకుండా డిసైడ్ చేసినందుకు అమ్మడు హర్ట్ అయ్యింది. ఇక వరుస అవకాశాలు రావడం చూస్తుంటే మళ్లీ ఇల్లి బేబ్ కు మంచి రోజులొచ్చాయనే అనిపిస్తుంది.


ఎలాగు స్టార్స్ తో నటించే అవకాశం వచ్చింది కాబట్టి తన పట్టు వదిలిపెట్టి అంఖేన్-2 లో కూడా నటించి హిట్ కొట్టిందంటే మళ్లీ కెరియర్ ఊపందుకునే అవకాశం ఉంది. ఈలోపు ఏదైనా లక్కీ ఛాన్స్ తగిలితే మళ్లీ దాన్ని మిస్ అవుతానేమో ఇలియానా ఆలోచన. సో రాక రాక వచ్చిన హిట్ తో ఇలియానా ఓ రకంగా సంతోషంగా ఉన్నా మరింత కన్ ఫ్యూజన్ లో పడ్డదని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: