బాలీవుడ్ లో సీనియర్ నటులు సునీల్ దత్, అందాల తార నర్గీస్ గారాల పట్టి..ముద్దుల కొడుకు సంజయ్ దత్త్. ప్రముఖ బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ ల సంతానం సంజయ్. చిన్నప్పటి నుంచి సినిమా నేపథ్యంలో పెరిగిన సంజయ్ దత్ సినిమాల్లో హీరోగా నటించాలని కోరిక ఉండేదట..ఇక తండ్రి దర్శకత్వంలో వచ్చిన రేష్మా ఔర్ షేరా చిత్రంలో గవాలీ గాయకుని పాత్రలో బాల నటునిగా నటించారు.  హీరోగా ఎదిగిన సంజయ్ డ్రగ్స్ కు అలవాటు పడటంతో అతనికి ఎన్నో రకాలుగా ట్రీట్ మెంట్స్ చేయించారు తండ్రి సునీల్ దత్. ఈ దిగులుతోనే ఆయన తల్లి దిగులుతో బాధపడుతూ ఉండేదట.  సంజయ్ దత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు..కానీ తన మొదటి సినిమా విడుదల సమయంలో చనిపోయారు.  1987లో నటి రిచా శర్మను వివాహ చేసుకున్నారు సంజయ్.[4] 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు.

ఆ తర్వాత 1998లో మోడల్ రియా పిళ్ళైను రెండో వివాహం చేసుకున్నారు సంజయ్. 2005లో వారు విడాకులు తీసుకున్నారు. రెండేళ్ళ డేటింగ్ తరువాత 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో పెళ్ళి చేసుకున్నారు ఆయన.అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా. 1993 బొంబాయి బాంబు పేలుళ్ళ ఘటనలో న్యాయస్థానం ఇతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.

ఈ మద్య శిక్ష పూర్తి చేసుకొని విడుదల అయ్యారు.  రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో కష్టాలు అనుభవించిన సంజయ్ దత్ ఇప్పుడు సాధుజీవిగా మారాడని అంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: