తెలుగు ఇండస్ట్రీలో ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు నెల కొల్పింది.  అంతే కాదు జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు కూడా గెలుచుకుంది.  ఈ చిత్రం వ్యూజువల్ వండర్స్ క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అంతే కాదు ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, మళియాల భాషల్లో  ఏక కాలంలో రిలీజ్ చేశారు.  ఇప్పటి వరకు తెలుగులో ఏ చిత్రానికి రాని కలెక్షన్లు ఈ చిత్రానికి వచ్చాయి..సుమారు 600 కోట్ల వసూళ్లు చేసిందని టాక్. అయితే ఇంత గొప్ప చిత్రాన్ని బీట్ చేయాలంలో మరో బాహుబలి లాంటి చిత్రమే రావాలని అన్నారు ఆమద్య. అయితే ఇప్పుుడు బాహుబలి కంటే అద్భుతమైన చిత్రం రాబోతుందట..బాహుబలి సృష్టించిన సంచలనాలను అవలీలగా ఈ చిత్రం అధిగమిస్తుందని నమ్మకంగా ఉన్నారు .

ఇంతకీ ఏంటా కథా అనుకుంటున్నారా..! తెలుగు ఇండస్ట్రీలో గజిని చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన సూర్య అంటే తెలియని వారు ఉండారు..ఆయన తమ్ముడు కార్తీ ‘యుగానికి ఒక్కడు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. వచ్చే రావడంతో చాలా మాస్ అప్పిరియన్స్ తో అభిమానులకు బాగా దగ్గరయ్యాడు. ఈ మద్య వచ్చిన ఊపిరి చిత్రంలో కూడా తన మాస్ యాక్షన్ తో అందరినీ బాగా ఆకర్శించాడు.  ఇప్పుడు గోకుల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న  ''కాష్మోరా ' చిత్రంతో కార్మీ మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది . భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కార్తీ గెటప్ విభిన్నంగా ఉండటమే కాకుండా మరో రెండు గెటప్ లలో కార్తీ దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది దాంతో ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగేలా చేస్తోంది. కార్తీ కి తమిళం లోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రం బాహుబలి ని తలదన్నడం ఖాయమని అప్పుడే కోలీవుడ్ లో కోడై కూస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: