ఈ మాట అంటుంది ఎవరో తెలుసా..బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఈ మద్యనే సుల్తాన్ సినిమాతో ఎన్నో సంచలన రికార్డులు నమోదు చేసుకున్న సల్మాన్ ఆ మద్య రియో ఒలంపిక్స్ లో పాల్గొన్న వారికి Rs. 1,01000 పారితోషికం కూడా ప్రకటించారు. అంతే కాదు క్రీడాకారులంటే తనకు ఎంతో గౌరవమని ఇన్ని కోట్ల మంది ప్రజల్లో కేవలం కొద్ది మందే క్రీడాకారులు పుడుతుంటారని అన్నారు. సల్తాన్ లాంటి సినిమా చూసినపుడు క్రీడాకారులు ఎంతో మంది తనను ప్రత్యేకంగా అభినందించారని అన్నారు. రియో ఒలింపిక్స్ క్రీడల్లో అత్యుత్తమ ఆటతీరును కనబరిచిన భారత షట్లర్ పీవీ సింధుపై అన్ని రంగాల వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇప్పుడు యావత్ భారత దేశం పివి సింధూ, సాక్షి మాలిక్ ల పేర్లే జపిస్తున్నారని అన్నారు. అంతే కాదు 'అమ్మా.. నేను సింధుతో ఫొటో దిగాను. గర్వంగా ఉంది' అంటూ పేర్కొన్నాడు. పైగా ఈ మాటలు తన తల్లికి చెప్పి ఆనందపడ్డాడు. అలాగే సింధూతో దిగిన ఫోటో ట్విట్టర్ లో పెట్టి..'మా అమ్మతో కలిసి ఫైనల్ మ్యాచ్‌ను టీవీలో చూశాను. సింధుతో నేను ఫొటో దిగిన విషయాన్ని అమ్మకు చెప్పాను. గర్వంగా ఉంది' అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

మరోవైపు సింధూ ఆట చూసిన అమితాబచ్చన్ ఇలా మాట్లాడారు..సింధూ..నువ్వు ఆడిన ఆటతీరు చాలా చక్కగా ఉంది..చాలా శ్రద్దపెట్టి ఆడావు. గెలుపు, ఓటమి అనేది సహజం అయినా నువ్వు సాధించిన మెడల్ భారత దేశానికి గర్వకారణం అన్నారు. ఇంతకన్నా గొప్ప విజయం ఏముంటుంది' అని ట్వీట్ చేశారు.

సల్మాన్ ఖాన్ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: