టీమ్ ఇండియా క్రికెట్ లో దూకుడుగా ఆడుతూ తన బౌలింగ్ తో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన క్రికెటర్ శ్రీశాంత్. తక్కువ టైమ్ లో ఎక్కువ పేరు తెచ్చుకొని అదే రీతిలో బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నాడు. జట్టులో ఒకప్పుడు కీలక బౌలర్‌గా ఎదిగిన కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌కు ఆది నుంచీ దూకుడెక్కువే. తన ప్రవర్తనతో ఎన్నోసార్లు మందలింపునకు గురయ్యాడు. మైదానంలో ఏమాత్రం ఆవేశం ఆపుకోలేని తత్వంతో వివాదాస్పదంగా మారాడు. 2013 లో స్పాట్ ఫిక్సింగ్ లో పట్టుబడి జీవితకాలం నిషేధం ఎదుర్కొంటున్న టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ మనకు ఒక సింగర్ గానూ, డ్యాన్సర్ గానూ తన ప్రతిభ నిరూపించుకున్నాడు.    

శ్రీశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం టీమ్ 5. శ్రీశాంత్ చాలా మంచి డ్యాన్సర్ అనే విషయం తెలిసిందే. గతంలో శ్రీశాంత్ ను హీరోగా పరిచయం చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ రాజ్ జకారిస్ ప్రొడక్షన్ వాల్యూస్, సురేష్ గోవింద్ చెప్పిన కథ, కథనం బాగా నచ్చడంతో హీరోగా నటించేందుకు ఒప్పుకున్నారు. పదునైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్ ను హడలెత్తించిన శ్రీశాంత్... నటనలోనూ అంతే చలాకితనం, అంతే పట్టుదలను చూపిస్తున్నారు. ఇందులో శ్రీశాంత్ చాలా స్టైలిష్ గా కనిపించబోతున్నారు. తన క్యారెక్టర్ తో పాటు, డైలాగ్స్, డ్యాన్స్, ఫైట్స్, గెటప్, కాస్ట్యూమ్స్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ పెయిర్ చూడముచ్చటగా ఉండనుంది. వీరితో పాటు పెర్ల్ మానే, మఖరంద్ దేశ్ పాండే ఇతర పాత్రలు పోషించారు. గోపి సుందర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు.  


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ జకారియాస్ మాట్లాడుతూ... ఇండియన్ మాజీ స్టార్ క్రికెటర్ శ్రీశాంత్ ని సిల్వర్ స్క్రీన్ మీద చూడాలని ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. చాలా మంది దర్శక నిర్మాతలు శ్రీశాంత్ ని హీరోగా పరిచయం చేయాలని ట్రై చేశారు. కానీ మా కథ, కథనం మీద నమ్మకంతో... ఆయన బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఉండే క్యారెక్టర్ కావడంతో ఒప్పుకున్నారు. కేవలం ఒప్పుకోవడమే కాకుండా క్యారెక్టర్ కు తగ్గట్టుగా తనను తాను మలచుకున్నారు. డైలాగ్స్, డ్యాన్సులు, ఫైట్స్ ఇరగదీస్తున్నారు. కన్నడ స్టార్ హీరోయిన్ నిక్కీ గర్లానీ, శ్రీశాంత్ మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. టీమ్ 5 అనే టైటిల్ కు తగ్గట్టుగా మా దర్శకుడు సురేష్ గోవింద్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నాం. త్వరలోనే మరిన్ని వివరాల్ని తెలియజేస్తాం. అని అన్నారు.  
నటీనటులు, శ్రీశాంక్. నిక్కీ గర్లానీ, పార్లే మానే, మకరంద్ దేశ్ పాండే తదితరులు సాంకేతిక నిపుణులు



మరింత సమాచారం తెలుసుకోండి: