తెలుగు తెరపై పవన్ కళ్యాన్ అంటే ఇప్పుడు ప్రభంజనం..కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా రాజకీయ నాయకుడిగా అందరి మనసు గెలుచుకున్న నాయకుడు. ఒకప్పుడు టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంత క్రేజ్ ఉండేదో ఇప్పుడు పవన్ కళ్యాన్ కి అంత క్రేజ్ ఏర్పడింది. అయితే వ్యక్తిగతంగా చాలా సింపుల్ గా కనిపించే పవన్ కళ్యాన్ చాలా ఉదార స్వభావుడు..ఎన్నో గుప్త దానాలు చేసే వ్యక్తి..ఆ మద్య ఓ చానల్ లో ఓ మహిళ ఆయన చేసిన సహాయం గురించి చెబుతూ పవన్ ఇంటికి వెళ్లిన తనను సాదరంగా ఆహ్వానించి డబ్బులు ఇచ్చి కారులో తనే స్వయంగా డ్రాప్ చేసినట్లు చెప్పింది.  ఒక నటుడుగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల మనిషి అయ్యారు. ఇక సినిమా పరంగా చూస్తే ఆయన ట్రెండ్ ఫాలో అవడు..ట్రెండ్ సెట్ చేస్తాడు అన్న టైప్ లో ఆయన సినిమా అంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతంది.

అయితే మొన్నామద్య వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం మాత్రం అంచనాలు అందుకోలేక పోయినా..పవన్ కళ్యాన్ ది బెస్ట్ యాక్టర్ అని పొగిడారు.  ప్రస్తుతం పవన్ – డాలీ కలయికలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇటీవలే సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ వారంలో పవన్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. రాయల సీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంపై అప్పుడే ఎన్నో ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఇందులో ఓ పవర్ ఫుల్ ఫ్యాక్షనిస్టుగా...ఓ చిలిపి ప్రేమికుడిగా పవన్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడట.

అంతే కాదు ఈ చిత్రంలో ‘పెళ్లి చూపులు’ విజయ్ దేవరకొండ ఓ పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు విజయ్ తో పాటుగా మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా పవన్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారమ్. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు యంగ్ హీరోలు అవసరం ఉండగా ఆ ముగ్గురు హీరోలు విజయ్ దేవరకొండ, నవీన్ చంద్ర, శర్వానంద్  అని తెలుస్తుంది.

ఈ ముగ్గురు హీరోలను పవన్ స్వయంగా తన ఆఫీస్ కి పిలిపించుకొని మరీ తీసుకున్నట్లు తెలుస్తుంది. సినిమాలో పవన్ ఫ్యాక్షనిస్ట్ లీడర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. పవన్ కి అనుచరులుగా ఈ యంగ్ హీరోలు కనిపించే ఛాన్స్ ఉన్నట్టు ఫిల్మ్ నగర్ గుస గుస. ఏది ఏమైనా మరో పవర్ ఫుల్ స్టోరీతో పవన్ అభిమానులను అలరించబోతున్నమాట వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: