నిన్న రాత్రి జరిగిన మెగా స్టార్ చిరంజీవి 61వ జన్మదినోత్సవ వేడుకలలో అతిథి గా వచ్చిన అల్లు అర్జున్ వేసిన సెటైర్ కు ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు మాత్రమే కాకుండా రామ్ చరణ్ కూడ షాక్ అయ్యడు.  మెగా యoగ్ హీరోల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్ లో రామ్ చరణ్ ఉద్వేగ పూరితంగా మెగా అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు మధ్యలో కల్పించు కున్న అల్లు అర్జున్ వేదిక పై వచ్చి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. 

మెగా అభిమానులు  ఈ ఫంక్షన్ కు చిరంజీవి రాలేక పోయిన నేపధ్యంలోబాధ పడుతున్న విషయాన్ని బన్నీ బయట పెడుతూ ఈ సెటైర్ వేసాడు.  మెగా స్టార్ రాలేదని బాధ పడటం ఎందుకు వేదిక పై మరో మెగా స్టార్ ఉన్నాడు కదా ? అని చరణ్ వంక బన్నీ వ్యూహాత్మకంగా చూడటం అందర్నీ ఆశ్చర్య పరిచింది.  

ఈ మధ్య కాలంలో బన్నీ వరస విజయాలతో దూసుకు పోతూ మెగా కాంపౌండ్ కు షాక్ ఇస్తున్న నేపధ్యం తెలిసిందే. దీనితో  చిరంజీవి వారసుడు రామ్ చరణ్ మాత్రమే అని అర్ధం వచ్చేడట్లుగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఉన్నాయని ఈ సమావేశానికి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. 

ఇదే సందర్భంలో చరణ్ మాట్లాడుతూ  మెగా అభిమానులు తన తండ్రి చిరంజీవి పై చూపెడుతున్న అభిమానం తనను ఎంతగానో కదిలించి వేస్తోందని కామెంట్స్ చేసాడు.  అంతేకాదు మెగా అభిమానులు చూపెడుతున్న అభిమానం చూస్తూ ఉంటే చిరంజీవికి అభిమానులే కుటుంబ సభ్యులుగా మారిపోయారా అని అనిపిస్తోంది అని సంచలన వ్యాఖ్యలు చేసాడు చరణ్.  

ఇక సినిమాలకు సంబంధించి కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ ఉంటాయి మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి అన్న విషయాన్ని గుర్తుకు చేస్తూ తాము నటించిన సినిమాలు కొన్ని ఫెయిల్ అయినా తమ కుటుంబం పై విపరీతమైన ప్రేమను కురిపించే అభిమానుల ఋణం తాము ఈ జన్మలో తీర్చుకోలేము అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు రామ్ చరణ్.  ‘ఇక ఇదే ఫంక్షన్ లో చిరంజీవి 150వ సినిమా దర్శకుడు వినాయక్ మాట్లాడుతూ అన్ని పత్రికలలో చిరంజీవి 61వ పుట్టినరోజు అని వ్రాసారని కాని వాస్తవానికి చిరంజీవి జరుపుకుంటున్నది తన 21వ పుట్టినరోజు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  

దీనికి కారణం ‘ఖైదీ నంబర్ 150’ లో చిరంజీవి తన లుక్ లో అదేవిధంగా తన డాన్స్ ఫైట్స్ ల విషయంలో 21 సంవత్సరాల కుర్రాడు లా కనిపించ బోతున్నాడు అంటూ ఈ
సినిమా పై మెగా అభిమానులలో మరింత అంచనాలు పెంచాడు వినాయక్. ఈ సందర్భంలో ఈ సినిమాలో చిరంజీవి చెప్పే ఒక డైలాగ్ ను  చెప్పి మెగా అభిమానులకు జోష్ ను తెచ్చాడు.  ‘పవర్ నా ఒంట్లో ఉంటే – హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది’ అని చిరంజీవి ఒక సందర్భంలో ఈ సినిమాలోని విలన్ తో అంటాడు అని వినాయక్ చెప్పగానే మెగా అభిమానుల ఈలలతో మెగా స్టార్ పుట్టినరోజు వేడుకలు హోరెత్తి పోయాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: