తెలుగు ఇండస్ట్రీలో లక్ష్మీ కళ్యాన్ చిత్రంతో తళుక్కున మెరిసిన తార కాజల్ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది..ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అయినా ఈ అమ్మడి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంలో కాజల్ ఐటమ్ సాంగ్ ఉందని ఆ మద్య వార్తలు వచ్చాయి.  తాజాగా  ఈ చిత్రం ఆడియోను ఈ నెల 12న విడుదల చేశారు. ఆ ఆడియో వేడుకలోనే సెప్టెంబర్ 2న విడుదల చేస్తామని డేట్ కూడా అనౌన్స్ చేసేసారు.  

ఇక షూటింగ్ షరవేగంగా జరుపుకోవాలని తొందరలో ఉన్నారు.. కానీ ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేస్తున్న కాజల్ చిత్ర యూనిట్ కు షాక్ ఇచ్చింది.  అసలు విషయానికి వస్తే..డ్రెస్ విషయంలో దర్శకుడితో గొడవ పడ్డ కాజల్, ఆ గొడవ కాస్త పెద్దది కావడంతో కాజల్ కోపంతో షూటింగ్ మధ్యలోనే బయటకు వచ్చి ఎయిర్ పోర్ట్ కు వెళ్లిపోయిందట.

కాజల్ ను పట్టుపట్టి మరీ ఈ స్పెషల్ సాంగ్ కు తీసుకున్న ఎన్టీఆర్ ఈ సంఘటనతో ఖంగు తిన్నాడట. అసలే ఐటమ్ సాంగ్ కాస్త డ్రెస్ విషయంలో పట్టూ విడుపూ ఉండాలి కదా అన్న విషయానికి కాజల్ కి తెగ కోపం వచ్చిందట..ప్రస్తుం తాను లీడింగ్ లో ఉన్న హీరోయిన్ అని మరీ ఎబ్బెట్టుగా ఉండే కాస్ట్యూమ్స్ వేసుకోవడం తన వల్ల కాదని ఖచ్చితంగా చెప్పడంతో డైరెక్టర్ కొరటాలకు, కాజల్ కి మద్య చిన్న పాటి గొడవే జరిగినట్లు సమాచారం.

సాంగ్ లో వైట్ కాస్ట్యూమ్స్ వేసుకోనని ఆమె చెప్పినా చిత్ర యూనిట్ మళ్లీ అదే కాస్ట్యూమ్స్ ఇవ్వడంతో ఆమె ఫైర్ అయిందని సమాచారం. దీంతో చిర్రెత్తుకొచ్చిన కాజల్ చెప్పా పెట్టకుండా అక్కడ నుంచి వెళ్లడంతో కాజల్ ఇలా షూటింగ్ మధ్యలో నుంచి వెళ్లిపోవడంతో ఎన్టీఆర్ కు కొరటాల శివకు ఏమీ అర్ధం కావడంలేదట. కొంతమంది మాత్రం కాస్ట్యూమ్స్ గురించి కాదు వేరే ఉందని ప్రచారం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: