ఏడాదికి దాదాపు వెయ్యి సినిమాలవరకూ తెరకి ఎక్కే పరిశ్రమ భారతీయ సినిమా పరిశ్రమ. ఎంత లేదు అనుకున్నా 14000 కోట్ల బుజినెస్ సినిమాల చుట్టూనే నడుస్తోంది అనేది నిర్వివాదాంశం. కథ చెప్పిన స్క్రిప్ట్ రైటర్ దగ్గర నుంచీ సినిమా పూర్తయ్యాక , విడుదల అయ్యాక  థియేటర్ లో సమోసాలు అమ్ముకునే వ్యక్తి దగ్గర వరకూ లక్షలాది మంది పరోక్షంగా ప్రత్యక్షంగా పాల్గొనే వ్యాపారం ఈ వ్యాపారం. పద్నాలుగు వేల కోట్లు అంటే మామూలు మాటలేం కాదు.


ఎన్నో కార్పరేట్ కంపెనీలకి ధీటుగా సినిమా పరిశ్రమ కూడా ఉపాధి కల్పిస్తోంది అని అందులోని వారు గర్వంగా చెప్పుకోదగ్గ విషయమే. సినిమా పరిశ్రమ కి మొదటి నుంచీ ఎన్నో ఆటంకాలు ఉంటూనే ఉంటాయి. కథ ఓకే అయ్యాక హీరోలు రిజెక్ట్ చెయ్యడం, డైరెక్టర్ మార్పులు చెయ్యడం , షూటింగ్ లో ఇబ్బందులు మామూలే. ఇక మంచి స్టోరీ ని అన్ని కష్టాలు పడి తెరకి ఎక్కించిన తరవాత విడుదల కోసం నానా ఇబ్బందులూ పడ్డం ప్రతీ సినిమాకీ మామూలే.


చిన్న చిత్రాల సంగతైతే అస్సలు చెప్పనే అక్కరలేదు. ఎందుకు సినిమా తీసాం రా బాబూ అన్నట్టు తలలు పట్టుకుంటూ ఉంటారు. అన్ని కష్టాలు పడి సినిమా లు తీస్తున్న భారతీయ పరిశ్రమ 14000 కోట్ల బిజినెస్ చేస్తూ ఉంటే ఆశర్యకరంగా ఈ సినిమాలు అప్పనంగా పైరసీ చేసే వాళ్ళు 18000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. దొరతనంగా సినిమా ని విడుదల చేస్తుంటే వారికి రాని ప్రాఫిట్ లు దొంగతనంగా సినిమాలు విడుదల చేస్తున్నవారికి దక్కడం ఆశ్చర్యకరం. ఈ విషయం లో ప్రభుత్వం , పరిశ్రమ ఎన్ని గట్టి నిర్ణయాలు తీసుకున్నా పరిస్థితి మారకపోవడం చాలా దారుణమైన విషయం. ఒక్కొక్కసారి సినిమా విడుదల కంటే ముందర కొన్ని సీన్ లు లీక్ అవ్వడం, వీడియో పాటలు లీక్ అవ్వడం ఇవి ఇంకా పెద్ద డ్యామేజ్ సృష్టిస్తున్నాయి. మరీ రేర్ కేస్ లలో సినిమా మొత్తం విడుదల అయ్యి ప్రొడ్యూసర్ నెత్తిన తడిగుడ్డ వేస్తున్నాయి.


కథ పుట్టడం దగ్గర నుంచి సినిమా పూర్తి చెయ్యడం వరకూ దాదాపు మూడు సంవత్సరాలు పడుతోంది ఒక సినిమా పూర్తి అవ్వడానికి ఆ కష్టం మొత్తం రెండు మూడు గంటల్లో దోచేస్తున్నారు పైరసీ దారులు. నిజానికి ఇది చాలా చిన్న విషయం గా కనపడుతుంది కానీ 18000 ల సంపాదన అంటే పైరసీ వలన ఎంత నష్టం అనేది క్లియర్ గా కనపడుతోంది. ఉదాహరణ కి పోయి సంవత్సరం విడుదల అయిన షారూఖ్ ఖాన్ సినిమాకి 148 కోట్ల కలక్షన్ లు ఒచ్చాయి ఈ సినిమా విడుదల కంటే ఒక్కరోజు ముందరే పైరసీ లీక్ అయిపోయి పెద్ద ఎత్తున సీడీల రూపం లో బయటకి వచ్చేసింది.



ఈ సినిమాకి వచ్చిన 148 కోట్ల వసూళ్లు కంటే పైరసీ దారులకే ఎక్కువ  వసూళ్లు ఒచ్చాయి అంటే ఇది నిజంగా షాకింగ్ విషయం. ఈ సంవత్సరం విడుదల అయిన ఉడ్తా పంజాబ్ , గ్రేట్ గ్రాండ్ మస్తీ , కబాలి సినిమాల పరిస్థితి కూడా ఇంతే ఉంది. ప్రొడ్యూసర్ లకి వచ్చిన సొమ్ముకి నాలుగు రాళ్ళు ఎక్కువే సంపాదిస్తున్నారు పైరసీ రాయుళ్ళు. ప్రపంచ మేథో హక్కుల సంస్థ అధికారికంగా చెప్పిన ఈ లెక్కలతో షాక్ తిన్నారు జనాలు. టెక్నాలజీ విపరీతంగా పెరిగింది, ఇలాంటి వాటికి చెక్ పెట్టడం తేలికైన విషయమే కాకపోతే పెరిగిన టెక్నాలజీ నే చెక్ పెట్టిన చోట మరింత ఎక్కువగా రూట్ మ్యాప్ గీసుకుని మరీ దూసుకుని ఒస్తోంది పైరసీ .


థియేటర్ లలో డైరెక్ట్ గా క్యాం కార్డర్ పెట్టి షూట్ చేసేసే మహానుభావులు ఉన్నారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 2020 నాటికి సినిమా పరిశ్రమ దాదాపు ముప్పై వేల కోట్ల మార్కెట్ ని ఇస్తుంది. అదే టైం లో పైరసీ కూడా పెరిగి తీరుతుంది, వారు ఈ లెక్కకి డబల్ లో అంటే అరవై వేల కోట్ల లాభాలు పొందే ఛాన్స్ లు లేకపోలేదు. ఇప్పటికే ప్రభుత్వం , సినిమా నిర్మాతలూ ఈ పైరసీ ని ఉక్కుపాదం తో అణిచేయాలి అని సీరియస్ గానే పావులు కదుపుతున్నారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని పైరసీ రాయుళ్ళు కొత్త కొత్త రూట్ లలో వచ్చి మరీ సినిమాలకి బొక్క పెడుతున్నారు. త్వరలో నే దీనికి అడ్డుకట్ట పడుతుంది అని ఆశిద్దాం . 



మరింత సమాచారం తెలుసుకోండి: