సినిమా హీరోలు అంటే అభిమానించే వారు చాలా మంది ఉంటారు..అయితే ఒక్కో హీరో కి ఓ అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకొని తమ హీరోకి సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రామ్స్ అయినా తమ స్థాయికి మించి హంగామా చేస్తుంటారు. ఇక ఆ హీరో ఆడియో వేడుక దగ్గర నుంచి విడుదలై థియోటర్లో ప్రదర్శించే వరకు తన సొంత కుటుంబానికి చేసింద సందడీ..ఆర్భాటం చేస్తుంటారు. అయితే హీరోలు మాత్రం ఇలా వచ్చి అలా హాయ్ చెప్పి వేళ్తారు..అదే అభిమానులకు వేయ్యి ఏనుగుల బలంలా ఫీల్ అవుతారు. ఇక తరుచూ అభిమాన సంఘాల మద్య భేదాభిప్రాయాలు రావడం విమర్శించుకోవడం చివరకు అవి కొట్టుకునే స్థాయి వరకు వెళ్లడం కామన్ గా జరుగుతుంది.

అయితే మరోవైపు హీరోలు మాత్రం అభిమానుల అలా చేయవద్దని హిరోలం అందరం ఒకే గూటి పక్షులమని చెబుతుంటారు. ఏది ఏమైనా కొన్ని సార్లు ఆ అభిమానం ప్రాణాలకు మీదకు కూడా తెచ్చిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమానిని దారుణంగా చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ దారుణ సంఘటన కర్ణాటక లోని కోలార్ లో జరిగింది. చనిపోయిన వ్యక్తి తిరుపతికి చెందిన వినోద్ రాయల్ అని తెలిసింది. ఇక వినోద్ జనసేన కార్యకర్తగా పని చేసేవాడని పవన్ అంటే పిచ్చిగా అభిమానించే వాడని తనస్నేహితులు అంటున్నారు.  

అయితే కర్ణాటక లోని కోలార్ లో జరిగిన మరో హీరో వేడుక కోసం తన మిత్రుడి తో కలిసి వెళ్ళాడు వినోద్ అయితే సదరు హీరోని పొగడ్తలతో ముంచెత్తుతుండగా స్నేహితుల మద్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో ఎదరు తిరిగిన పవన్ అభిమాని వినోద్ ని కత్తితో పొడిచాడు. వెంటనే స్పందించి వినోద్ ని కారులో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మద్యలోనే చనిపోయాడట. వినోద్ ని తిరుపతి కి తరలించడం తో పెద్ద ఎత్తున పవన్ ఫ్యాన్స్ తరలి వచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: