టాలీవుడ్ ఏ హీరో సినిమా అయినా ఎలా ఉంటుందో అంచనాలేయొచ్చేమో కాని యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ విషయంలో మాత్రం ఆ లెక్కలు సరిచేయలేం. కెరియర్ మొదలెట్టిన సమయంలోనే ఆది, సిం హాద్రి లాంటి సూపర్ హిట్లతో బాక్సాఫీస్ ను షేక్ ఆడించిన జూనియర్ కెరియర్ పీక్స్ వెళ్లిన సందర్భాలు మనకు తెలిసిందే. 


అయితే ఈ మధ్య కొంత రాంగ్ గైడెన్స్ తో తన ఫ్యాన్స్ కు కాస్త దూరమైన తారక్ ఇప్పుడు మళ్లీ లైన్లోకి వచ్చాడు. జస్ట్ ఫర్ ఏ చేంజ్ అంటూ టెంపర్, నాన్నకు ప్రేమతోతో తనలోని డిఫరెంట్ యాంగిల్ ట్రై చేసిన తారక్ ఇప్పుడు కొరటాల శివతో జనతా గ్యారేజ్ తో ముందుకొస్తున్నాడు. ఆడియో రిలీజ్ నాడే సినిమా హిట్ కొడుతున్నాం అన్న కాన్ఫిడెన్స్ తో మాట్లాడిన జూనియర్ సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.     


అందుకే మొన్నటిదాకా సెప్టెంబర్ 2 అంటూ చెప్పిన రిలీజ్ డేట్ సడెన్ గా ఓ రోజు ముందుకు జరిపారు. అయితే దీనికి కారణం సెప్టెంబర్ 2న భారత బంద్ కు పిలుపునివ్వడమే. బంద్ రోజు అంటే సినిమా క్రేజ్ తగ్గే అవకాశం ఉందని తార్క్ ముందే పసిగట్టి తన సినిమాను ఓ రోజు ముందే రిలీజ్ చేస్తున్నాడు. ఇక సినిమాలో ఉన్న కంటెంట్ నమ్మే ఈ తెగింపు చూపిస్తున్నట్టు కనిపిస్తుంది.


కొరటాల మార్క్ కథ కథనలాతో యంగ్ టైగర్ ను ఎలా చూడాలనుకుంటున్నారో అలానే ఫ్యాన్స్ కు నచ్చేలా అదిరిపోయేలా ఓ నేచర్ లవర్ గా చూపించి టీజర్ తోనే ఇంప్రెస్ చేశాడు. సమంత, కాజల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి అదిరిపోయే మ్యూజిక్ అందిచాడు.


కథా బలమున్న సినిమాలకు ఎప్పుడు తెలుగు ప్రేక్షకుల అండదండలుంటాయని తను తీసిన మొదటి రెండు సినిమాల ఫలితాలతో రుజువు చేసుకున్న దర్శకుడు కొరటాల శివ నుండి వస్తున్న ఈ మూడో చిత్రం ముందు రెండు సినిమాల కన్నా గొప్ప విజయం సాధించాలని కోరుకుందాం. 



మరింత సమాచారం తెలుసుకోండి: