పవన్ కళ్యాణ్ చిరంజీవి లు ఎంత సన్నిహితంగా ఉంటున్నారో తెలియచేసే మరో ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.  కొద్ది రోజుల క్రితం జరిగిన ‘రక్షాబంధనం’ పండుగనాడు పవన్ కూతురు పొలేనా తన అన్న రామ్ చరణ్ కు రాఖి కడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయింది.

ఇప్పుడు ఈఫోటో సోషల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఈ ఫోటోను పవన్ అభిమానులు మరిము చిరంజీవి అభిమానులు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటూ పవన్ చిరంజీవిల మధ్య తిరిగి పెరిగిపోతున్న సాన్నిహిత్యం చూసి ముచ్చట పడుతున్నారు.  ఈ ఫోటోలో పొలేనా రామ్ చరణ్ చేతికి రాఖీ కడుతూ ఉంటే చరణ్ చెల్లెలుతో నవ్వుతూ కనిపించడం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే పొలేనా కు తన అన్న చరణ్ ఏమి కానుక ఇచ్చాడు అన్న విషయమై స్పష్టత లేదు.  చరణ్ కు రాఖీ కట్టిన పొలేనా కు తన అసలు అన్న అకిరానందన్ గుర్తుకు రాలేదా ? లేదంటే పూనాకు ప్రత్యేకంగా తన రాఖీ ని పంపిందా అన్న విషయమై మెగా అభిమానులకు ఆ శక్తికరమైన చర్చలు చేసుకుంటున్నారు.

చిరంజీవి జన్మదిన వేడుకలలో పవన్ భార్య అన్నా హడావిడి చేస్తే ఈ ఫంక్షన్ కు కొద్ది రోజులు ముందు జరిగిన రాఖీ పండుగనాడు పవన్ కూతురు పొలేనా రాఖి తో హడావిడి చేయడంతో పవన్ చిరంజీవిల కుటుంబ సభ్యుల మధ్య రాకపోకలు బాగానే జరుగుతున్నాయి అన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అయితే ఇన్ని సంకేతాలు బయటకు కనిపిస్తున్నా చిరంజీవి పవన్ లు మాత్రం వీలైనంత వరకు ఒకరిక్కరు ఎదురవ్వకుండా ఈ వ్యూహాత్మక ఎత్తుగడను ఎందుకుకొన సాగిస్తున్నారు అన్నది మాత్రం ప్రస్తుతానికి ఎవరికీ తెలియని రహస్యం.  అందుకే మెగా కాంపౌండ్ ఎత్తుగడలు చాల మందికి అర్ధం కాని పజిల్స్..  

మరింత సమాచారం తెలుసుకోండి: