తెలుగు చిత్ర పరిశ్రమలోకి వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్. అచ్చూ తాత నందమూరి తారక రామారావు పోలికలు ఉన్న ఎన్టీఆర్ బాల నటుడిగానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ హీరోగా ‘నిన్ను చూడాలని’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ చిత్రానికి ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాల మూడున్నర లక్షలు. తర్వాత వచ్చిన స్టూడెంట్ నెం.1, ఆది,సింహాద్రి,యమదొంగ,అదుర్స్,భాష చిత్రాలతో ఒక్కసారే స్టార్ డమ్ పెరిగిపోయింది. గత సంవత్సరం వచ్చిన టెంపర్ చిత్రంతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు. ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రంతో త్వరలో విడుదల కాబోతుంది.
అయితే సెప్టెంబర్ 2న సినిమా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఆరోజు భారత్ బంద్ ఉన్నందున సినిమా ఓపెనింగ్స్ విషయంలో పెద్ద ఎత్తున నష్టం జరిగే చాన్స్ ఉన్నందున చిత్ర యూనిట్ మేల్కొని పట్టింపులకు పోకుండా సెప్టెంబర్ 2 నుండి సెప్టెంబర్ 1 కు డేట్ మార్చారు దాంతో మొదటి రోజు భీకరమైన వసూళ్లు రావడం ఖాయమై పోయింది . ఇక ప్రీమియం షోలు ఎలాగూ ప్లాన్ చేస్తారు కనుక ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నట్టు ఎన్టీఆర్ చిత్రం కౌంట్ డౌన్ మొదలైనట్లే లెక్క.
Image result for janatha garage shooting
ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా చాలా సంతోషించే విషయం ఎందుకంటే ఎంత తొందరగా సినిమా వస్తే అంత సంతోషపడేది వాళ్ళే కదా ! కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏది ఏమైనా గత సంవత్సరా టెంపర్ చిత్రం ఈ సంవత్సరం నాన్నకు ప్రేమతో చిత్రాలు హిట్ కావడంతో మంచి జోష్ మీద ఉన్న ఎన్టీఆర్ ఈ చిత్రం హిట్ అయితే హ్యాట్రిక్ కొట్టినట్టే..!


మరింత సమాచారం తెలుసుకోండి: