ప్రస్తుతం మెగాహీరోలు అంతా ఫాంలో ఉండటంతో ఇండస్ట్రీ అంతా మెగాహీరోలతో కోలాహలంగా ఉంది. చిన్నసైజు క్రికెట్ లా ఉన్న ఈ మెగాహీరోలకి ఇప్పుడు కెప్టెన్ గా మెగాస్టార్ చిరంజీవి జాయిన్ అవ్వటం ఈ టీంకే ఓ కల వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ఖైదీనెం.150. తాజాగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా, చిరు 150వ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, టైటిల్ ని రిలీజ్ చేశారు.

అలాగే అదేరోజు ఓ లగ్జరీ హాటల్ లో చిరు బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఇదిలా ఉంటే శిల్పకళా వేధికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మెగాస్టార్ లేని లోటుని రామ్ చరణ్ తీరుస్తున్నాడని, రామ్ చరణ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న మెగాస్టార్ అని అల్లుఅర్జున్ డైరెక్ట్ గా కామెంట్ చేశాడు. ఈ పరిణామానికి రామ్ చరణ్ సైతం షాక్ అయ్యాడు. అయితే ఫంక్షన్ అనంతరం ఈ విషయంపై చిన్న డిస్కషన్ జరిగిందని మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం.

మరోసారి తనని ఆడియో ఫంక్షన్స్ వేధికలో ఇలా బుక్ చేయవద్దని  అల్లుఅర్జున్ కి రామ్ చరణ్ సున్నితంగా చెప్పాడంట. ఇది కూడ ఇద్దరి మధ్య ఫన్నీగానే చర్చలు జరిగాయని అంటున్నారు. అయితే ఇంత కాలం రామ్ చరణ్ ని మెగాపవర్ స్టార్ గా పిలుచుకుంటున్నారు. ఆ తరువాత మెగాస్టార్ అనే బిరుదు కచ్ఛితంగా రామ్ చరణ్ కే చెందుతుందని అల్లుఅర్జున్ స్వయంగా ప్రకటించటంతో…మెగాహీరోల మధ్య ఎటువంటి విభేధాలు లేవనేది స్పష్టంగా తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాలను తీస్తూ ముందుకు వెళుతున్నారు. రామ్ చరణ్, బన్నీ చిత్రాల మార్కెట్ ఇండస్ట్రీకి పెద్ద ప్లస్. మూవీ సక్సెస్ కొట్టిందంటే చాలు…బక్సాపీస్ వద్ద కనక వర్షం కురవాల్సిందే. ఇద్దరికి సమాన స్టార్ డం ఉన్నప్పటికీ రామ్ చరణ్ ని మెగాస్టార్ తో పోల్చిన అల్లుఅర్జున్ తీరు…అభిమానుల్ని సైతం సంతోష పెట్టిందని అంటున్నారు. ఇక చిరు మూవీకి సంబంధించిన టైటిల్ ఖైదీనెంబర్ 150 ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: