టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు బయట మరియు సినిమాలలో ఇంచుమించు ఒకలాగే ఉంటాడు.  తను నటించే సినిమాల పాత్రలకు అనుగుణంగా డిఫరెంట్ లుక్స్ లో కనిపించడం అదేవిధంగా తాను నటించే పాత్ర స్వభావం బట్టి తన డైలాగ్ మాడ్యులేషన్ మార్చడం చేయడు.  అయినా సినిమా సినిమాకు జయాపజయాలతో సంబందం లేకుండా మహేష్ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.

ఈ నేపధ్యంలో మహేష్ లేటెస్ట్ గా నటిస్తున్న మురగదాస్ సినిమాలో తన లుక్ ను మార్చుకోబోతున్నాడని బాగా పెంచిన గడ్డం గుబురు మీసంతో మహేష్ ఈ సినిమాకు సంబంధించి  కొన్ని సీన్స్ లో  కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది.  అయితే ఈ వార్తల పై మహేష్ అవును అని కానీ లేదు అని కానీ ఎటువంటి స్పందన ఇవ్వకపోవడంతో మహేష్ తన లుక్ కు సంబంధించి ఎదో ఒక మాయ చేయబోతున్నాడు అంటూ వార్తల హడావిడి చేసాయి.

అయితే ఈమధ్య కాలంలో ఎటువంటి ఫంక్షన్స్ లోను కనిపించని మహేష్  మొన్న రాత్రి పార్క్ హైయత్ హోటల్ లో జరిగిన చిరంజీవి డిన్నర్ పార్టీకి ఎప్పుడూ ఉండే విధంగానే కనిపిస్తూ ఒక మెరుపు మెరవడంతో మహేష్ లుక్ పై ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అన్నీ గాలి వార్తలుగా మారిపోయాయి.

అంతేకాదు ఈ పార్టీకి వచ్చిన అతిధులు కొందరు మహేష్ ను పలకరిస్తూ మురగ దాస్ మూవీ లో మహేష్ లుక్ గురించి డిటైల్స్ అడిగినప్పుడు కొత్త మహేష్ ను ఎక్కడ నుంచి తెచ్చేది అని జోక్ చేసినట్లు టాక్.  ఈ వార్తలు ఇలా ఉండగా మురగ దాస్ మహేష్ ల మూవీ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయింది అన్న వార్తలు  వస్తున్నాయి. 

హీరొయిన్ రకుల్ ప్రీత్ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ కావడంతో మురగదాస్ మహేష్ రకుల్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ షెడ్యూల్ ను చాల వేగవంతంగా పూర్తి చేసుకుని ముంబాయిలో జరగబోయే భారీ షెడ్యూల్ కు కౌంట్ డౌన్ మొదలైనట్లుగా తెలుస్తోంది.

ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమా టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ను విజయదశమికి విడుదల చేసి మహేష్ తన అభిమానులకు దసరా గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  మహేష్ కు సెంటిమెంట్ గా కలిసి వచ్చే మూడు అక్షరాల వెరైటీ టైటిల్ కోసం ఇప్పటికే మురగదాస్ అనేక ఆలోచనలు చేస్తున్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: