టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రస్తుత జనరేషన్ లో చాలా మార్పులు వచ్చాయి. మొదటి రెండు తరాల నటులు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు కానీ…ఆర్ధికంగా ఏ మాత్రం సెటిల్ కాలేకపోయారు. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రెండో తరం నటులలో అతి కొద్ది మంది మాత్రం ఆర్ధికంగా సెటిల్ కాగలిగారు. ఇక డబ్బు సంపాదించుకోలేని నటులు…వారి జీవితపు చివరి సమయంలో ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇవన్నీ నేటి తరం జనరేషన్ కి పాఠాలుగా మిగిలాయి. అందుకే ప్రస్తుత తరం నటులు ఒక్క సినిమా సక్సెస్ అయిన వెంటనే…ఆర్ధికంగా బలంగా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. రెమ్యునరేషన్ ని పెంచుకోవటంతో పాటు…కొన్ని స్థిరాస్తుల్ని..అలాగే ఇతర బిజినెస్ కార్యక్రమాలను చేయపడుతున్నారు. ఆ విధంగా ప్రస్తుతం యంగ్ హీరోలలో చాలా మంది ఒక వైపు మూవీల్లో నటిస్తూనే, మరోవైపు సొంత వ్యాపారాలను స్టార్ట్ చేశారు.

ఇండస్ట్రీలో సరైన గుర్తింపు లేకపోయినప్పటికీ…వారి జీవితాన్ని ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. అందులోని భాగంగానే ప్రస్తుతం యంగ్ హీరో రానా ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ..అటు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ నటిస్తూ, మరోవైపు సొంత బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఇక రానా స్టార్ట్ చేసిన వ్యాపారాల్లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రత్యక్ష భాగస్వామి. వీరిద్దరు ఇప్పటికే బాలీవుడ్ లో ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు.

ఇప్పుడు దీన్ని హైదరాబాద్ కి సైతం షిప్ట్ చేస్తున్నారు. తాజాగా రానా టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీ స్టార్ట్ చేశారు. ఇది ముంబైలో కార్యకలాలను చేస్తుంది. అలాగే దీన్ని హైదరాబాద్ లోనూ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. ఇందులోనూ అక్షయ్ కుమార్ కీలక పాత్ర వహిస్తున్నాడనేది ఇండస్ట్రీ టాక్. అక్షయ్ కుమార్, రానా ల మధ్య మంచి పరిచయాలు ఉండటంతో వీరిద్దరు హ్యాపారాల్లోనూ భాగస్వాములు కాగలిగారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: