ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస మూవీలలో హీరోయిన్ గా నటిస్తున్న హీరోయిన్ సమంత. సమంత ఒకవైపు హీరోయిన్ గా చేస్తూనే, మరోవైపు సామాజిక సేవ వంటి కార్యక్రమాలను చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం ఓ న్యూస్ సమంతకి షాకింగ్ ని ఇచ్చింది. ప్రస్తుతం సమంత చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలు కాకుండా కొత్త చిత్రాలు ఏవి సమంత వద్దకు రాలేదు.

ప్రస్తుతం చేతిలో ఉన్నా చిత్రాలు కూడ 2015లో చేసుకున్న అగ్రిమెంట్సే అని అంటున్నారు. ఈ మధ్య కాలంలో సమంతకి పలు చిత్రాల నుండి ఆఫర్స్ వచ్చినప్పటికీ...ఎక్కువ శాతం మధ్యలోనే ఆగిపోయినవే ఉన్నాయి. ఇక తన తోటి హీరోయిన్స్ మాత్రం సమంత కంటే ఎక్కువ ఆఫర్స్ ని ఈ సంవత్సరం చేజిక్కించుకున్నారు. కాజల్, తమన్న, అనుష్క లాంటి హీరోయిన్స్ కి ఈ సంవత్సరంలో దాదాపు 3 చిత్రాల వరకూ అగ్రిమెంట్స్ జరిగాయి.

సమంతకి కేవలం ఒకే ఒక్క మూవీ అగ్రిమెంట్ అయింది. ఇక చిన్న హీరోయిన్స్ ప్రస్తుతం పెద్ద హీరోయిన్స్ తో నటించేందుకు సిద్ధంగా ఉండటంతో...టాప్ హీరోలు కూడ సమంత కంటే బెటర్ గ్లామర్ ని చూస్తున్నారు. ప్రస్తుతం సమంత తీసుకుంటున్న రెమ్యునరేషన్ దాదాపు 2 కోట్ల రూపాయలను టచ్ కావటంతో..కొంత మంది నిర్మాతలు ఈ బ్యూటీ జోలికే వెళ్ళటం లేదు.

పెద్ద హీరోలు ప్రత్యేకంగా సమంతని అడిగితే తప్ప...ఈ బ్యూటీకి ఆఫర్స్ వరించటం లేదు. దీంతో తన ఫిల్మ్ కెరీర్ గ్రోత్ సరిగాలేదని సమంత గ్రహించిందట. ప్రస్తుతం ఎక్కడ కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందో సరి చేసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్స్. తాజాగా కోలీవుడ్ కి చెందిన టాప్ హీరోలు సైతం ఈ బ్యూటీని వద్దన్న వాళ్ళు చాలానే ఉన్నారనే రిపోర్ట్ కూడ ఇండస్ట్రీలో సర్క్యులేట్  అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: