సెప్టెంబ 1 న విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ రిలీజ్ కు ఇక కేవలం వారంరోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యంలో ఈ సినిమా పబ్లిసిటీని చాల డిఫరెంట్ గా చేయడమే కాకుండా కొన్ని గేమ్ షోస్ ను కూడ ఈసినిమా టైటిల్ పేరు పై ఛానల్స్ లో నిర్వహింప బోతున్నారనే వార్తలు వస్తున్నాయి.  యూత్ ను బాగా ఇన్వాల్వ్ చేస్తూ నిర్వహించే ఈ కార్యక్రమాలలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా పాల్గొనబోతున్నాడు అని టాక్.  

అంతేకాదు జూనియర్ అభిమానులను ఆహ్వానిస్తూ కొన్ని కాంటెస్ట్‌లు కూడా నిర్వహించాలని ‘జనతా గ్యారేజ్’ టీమ్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్యక్రమాలు అన్నీ ఈ వీకెండ్ నుంచి అన్ని ప్రముఖ ఛానల్స్ లోను హోరెత్తబోతున్నాయని టాక్.  ఈ వార్తలు ఇలా ఉండగా రిలీజ్ కు రెడీ అవుతున్న ‘జనతా గ్యారేజ్’ కి పైకి అనకపోయినా పెద్ద రిపేర్లు జరిగినట్లు వార్తలు వస్తున్నా యి. 

ఈ సినిమా సెకండాఫ్ అంతా టూ సీరియస్ గా ఎమోషనల్ గా రావడంతో కొంత చేంజ్ కోసం జూనియర్ కాజల్ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేసారని టాక్.  అంతేకాదు ముందు అనుకున్నదాని కంటే మోహన్ లాల్ కు ప్రాధాన్యత పెంచారని  సినిమాకు ఆ పాత్రే  హైలైట్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇలా కొన్ని మార్పులు చేర్పులు చేయడంతో చివరి నిముషంలో కొంత గందరగోళం ఏర్పడిన నేపధ్యంలో ప్రతి చిన్న విషయాన్ని జూనియర్ కొరటాల శివ తో కలిసి కోఅర్డినేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
 
ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత హైప్ తో విడుదల కా బోతున్న ఈసినిమా రాబోతున్న లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీని ఫుల్లుగా వాడేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజిలో జరిగిన నేపధ్యంలో విడుదల కూడా భారీగానే ఉండబోతోంది. ప్రపంచవ్యాప్తంగా 2500 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

తెలుగు.. మలయాళంతో పాటు తమిళంలో కూడా ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపధ్యంలో ‘బాహుబలి’ తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజవ్వబోయే తెలుగు సినిమాగా ఇది రికార్డు క్రియేట్ చేస్తోంది.  మన తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేనంత భారీగా ఈ చిత్రాన్నిరిలీజ్ చేయబోతున్నారు. తెలుగు వెర్షన్ మాత్రమే 1500కు పైగా స్క్రీన్లలో రిలీజవుతోంది  అంటే ఈ సినిమా మ్యానియా ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతోంది. 

ఒక్క అమెరికాలో ఈసినిమాకు 42 స్క్రీన్లు కన్ఫమ్ అయ్యాయి అన్న వార్తలు  వస్తున్నాయి. ఇప్పటిదాకా ఏ తెలుగు సినిమా కూడా గల్ఫ్ దేశలలో విడుదల కాని సంఖ్యలో దాదాపు  200కు పైగా స్క్రీన్స్ లో విడుదల అవుతున్న నేపధ్యంలో మోహన్ లాల్ సపోర్ట్ తో జూనియర్ ‘శ్రీమంతుడు’ రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం అన్న మాటలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: