గతంలో కొన్ని మీడియా సంస్థలు తన పై రాసే వార్తలు తన వెంట్రుకతో సమానం అని కామెంట్ చేసి వివాదాలలోకి చిక్కుకున్న రామ్ చరణ్ ఇప్పుడు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.  ప్రస్తుతం కొత్త లుక్ లో కనిపించడమే కాకుండా తన పద్ధతిలో చాల మార్పులు చేసుకుంటున్నాడు.  అంతేకాదు తన వల్ల మీడియాకు ఏదైనా ఇబ్బందులు కలిగియుంటే ఐ యామ్ సారీ అంటున్నాడు. 

ఆశక్తి కరమైన ఈ న్యూస్ వివరాలలోకి వెళితే చిరంజీవి 61వ పుట్టినరోజు  సందర్భంగా పార్క్ హైయత్ హోటల్ లో ఏర్పాటు చేసిన డిన్నర్ పార్టీకి మీడియా ప్రతినిధులను పిలిచి వారిని ఆ పార్టీ జరుగుతున్న గుమ్మం వరకే అనుమతించి లోపలకు రానివ్వక పోవడంతో మీడియా వర్గాలు చరణ్ పై విపరీతమైన అసహనంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.  దీనితో ఎలర్ట్ అయిన రామ్ చరణ్ ఎలర్ట్ అయి ఒక మెట్టు దిగి వచ్చి మీడియాకు క్షమార్పణలు చెప్పుకున్నాడు.  

‘నాన్న గారి పుట్టినరోజు నాడు పలు ఈవెంట్లలో పాల్గొన్న మీడియా వారందరికీ కృతజ్ఞతలు. కాకపోతే ఈవెంటులో మీడియాకు సంబంధించి జరిగిన ఏర్పాట్లలో చిన్న మిస్టేక్ జరిగిందని తెలిసింది క్షమించండి. ఈసారి ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లే చేయిస్తాను. మాకు ఈ సపోర్టు అందిస్తున్నందుకు థ్యాంక్స్’ అంటూ మీడియాకు సారీ చెబుతూనే స్పెషల్ మెసేజ్ ఒకటి పంపాడు చరణ్. ఎప్పుడూ మీడియాతో చాల దూరంగా ఉండే చరణ్ ఇలా మీడియాకు క్షమార్పణల సందేశాన్ని పంపడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

చిరంజీవి పుట్టినరోజు పార్టీలో వచ్చిన అతిధులు అందరికీ స్వయంగా చరణ్ చేతితో ప్లేట్ లో చికెన్ ముక్కలు వడ్డిస్తుంటే ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులంతా ఫిదా అయినట్లు వార్తలు వచ్చాయి.  బహుశా ఇలాంటి అవకాశాన్ని మిస్ అయినందుకు మీడియా ప్రతినిధులు బాధ పడి ఉంటారు.  చరణ్ ఒక మెట్టుదిగి సారీ చెప్పడంతో మీడియా వర్గాలకు వచ్చిన కోపం చల్లారి పోతుంది అనుకోవాలి.  

ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా పై వస్తున్న రూమర్ల పై అల్లుఅరవింద్ ఘాటు గానే స్పందించాడు.  ‘ధృవ’ షూటింగ్ లేటవుతోందని సినిమా అనుకున్న సమయానికి రెడీ కాకపోవచ్చని అని వస్తున్న గాలి వార్తల పై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రెస్ నోట్ ఇచ్చేశారు. ఆరు నూరైనా అక్టోబరు 7నే ‘ధృవ’ వచ్చి తీరుతుందని స్పష్టం చేశాడు అరవింద్.  

సెప్టెంబరు 5న ‘ధృవ’ చివరి షెడ్యూల్ పూర్తి అవుతుందని మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమాంతరంగా జరుగుతున్నాయని పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలుంటుందని.  అవి కూడా త్వరలోనే పూర్తి చేసి దసరా పండుగకు విడుదల చేస్తామని అరవింద్ ప్రకటించాడు.  ‘ధృవ’ సినిమా పై మీడియా వర్గాలు నెగిటివ్ కామెంట్స్ వ్రాయకుండా వ్యూహాత్మకంగా చరణ్ ఇలా మీడియాకు సారి చెప్పాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: