సినిమా ఇండస్ట్రీలో అంటే హీరోల కంటే వారిని అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లంటే ఎంతో అభిమానించే అభిమానులు తర్వాత మెగాస్టార్ చిరంజీవి అంటే అంతగా అభిమానించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాన్, మహేష్ బాబులను ఇష్టపడుతున్నారు.   ఒక్కో హీరో కి ఓ అభిమాన సంఘాలు ఏర్పాటు చేసుకొని తమ హీరోకి సంబంధించిన ఏ చిన్న ప్రోగ్రామ్స్ అయినా తమ స్థాయికి మించి హంగామా చేస్తుంటారు. ఇక ఆ హీరో ఆడియో వేడుక దగ్గర నుంచి విడుదలై థియోటర్లో ప్రదర్శించే వరకు తన సొంత కుటుంబానికి చేసింద సందడీ..ఆర్భాటం చేస్తుంటారు. అయితే హీరోలు మాత్రం ఇలా వచ్చి అలా హాయ్ చెప్పి వేళ్తారు..అదే అభిమానులకు వేయ్యి ఏనుగుల బలంలా ఫీల్ అవుతారు.  

రీసెంట్ గా కర్ణాటక లోని కోలార్ లో జరిగిన మరో హీరో వేడుక కోసం తన మిత్రుడి తో కలిసి వెళ్ళాడు వినోద్ అయితే సదరు హీరోని పొగడ్తలతో ముంచెత్తుతుండగా స్నేహితుల మద్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో ఎదరు తిరిగిన పవన్ అభిమాని వినోద్ ని కత్తితో పొడిచాడు. వెంటనే స్పందించి వినోద్ ని కారులో ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మద్యలోనే చనిపోయాడట. దీంతో అతని కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆ సంఘటన పవన్ కళ్యాణ్ చెవిన పడటంతో అతడి కుటుంబాన్ని పరామర్శించడానికి ఈరోజు తిరుపతి వెళుతున్నాడు పవన్. తన అభిమానులకు ఏ చిన్న కష్టం వచ్చినా స్పందించే పవన్ కళ్యాన్ వారి కుటుంబానికి బరోసా ఇవ్వడానికి వెళ్తున్నందుకు అభిమాన సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: