ద్వాపర యుగంలోని కృష్ణుడిని కలియుగంలోకి తెచ్చిన విశిష్టత సినిమాలకే దక్కింది. ఆబాల గోపాలాన్ని తన అల్లరి పనులతో ఆటలాడించిన కృష్ణుడి లీలను కళ్లకు కట్టినట్టు చూపించి మెప్పించారు మన దర్శక నిర్మాతలు. ఇక కలియుగ కృష్ణుడు అంటే అందరికి కనుల ముందు ప్రత్యక్షమయ్యే రూపం ఒక్కటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు.


మైతలాజికల్ సినిమాల్లో నటించడం ఆయనకు ఆయనే సాటి అని చాటి చెప్పారు. రాముడు, కృష్ణుడు, రావణుడు, వెంకటేశ్వరుడు ఇలా ఆయన చేయని పాత్ర లేదంటే నమ్మాలి. అయితే ఎన్ని పాత్రలు చేసిన ఎంతమంది దేవుడి గెటప్ వేసినా ఎన్టీఆర్ కృష్ణుడి గెటప్ వేస్తే ఆ క్రేజే వేరు.  


అప్పట్లో ఎన్.టి.ఆర్ కృష్ణుడి వేశం వేసిన ఫోటోలకు పూజలు చేసేవారంటే నమ్మాలి. నిజంగా కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు. కాని సినిమా కృష్ణుడు చూస్తే ఆ కృష్ణుడు ఇలానే ఉంటాడు అనిపించక మారదు. రాగ ద్వేషాలకు అతీతంగా తన అల్లరి చేష్టలతో సమస్యను సృష్టించడం దాని పరిహారం చూపించడం అది కేవలం కృష్ణుడు వల్లే అయ్యింది.


ఇక వెండితెర మీద కృష్ణావతారం ఎత్తిన వారిలో  ఎన్టీఆర్ గొప్ప విశిష్టత తెచ్చుకున్నారు. అసలైన కృష్ణుడు ఇలానే ఉంటాడేమో అన్న అందమైన రూపంతో ఆయన అలంకరణ ఉండేది. ప్రేమ జాలి దయ కరుణ ఇలా కృష్ణుడు హావభావాలను పలికించడంలో ఎన్టీఆర్ కు సాటిలేరు.   


ఇక ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించిన సినిమాల విషయానికొస్తే అప్పట్లోనే పెద్ద విజయాలను అందుకున్నాయి. ఎలాంటి సాంకేతిక నిపుణత పరిజ్ఞానం లేని ఆ రోజుల్లోనే ఎంతో వైవిధ్యమైన సినిమాలు తీసి ప్రేక్షకులకు అందించారు.  


మాయా బజార్, వినాయక చవితి, దాన వీర శూర కర్ణ, శ్రీ కృష్ణ పాండవీయం, శ్రీ కృష్ణ సత్య, శ్రీకృష్ణ విజయం, వీరాభిమన్యు, శ్రీకృష్ణావతారం సినిమాల్లో ఎన్టీఆర్ కృష్ణుడిగా నటించి మెప్పించారు. తనకు మాత్రమే సొంతమైన రూపంతో అంతకుమించిన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షక హృదయల్లో కృష్ణుడిగా చిర స్థాయిలో నిలిచిపోయారు ఎన్టీఆర్.     



మరింత సమాచారం తెలుసుకోండి: