మీడియా మీద యాంటీగా ఒక సినిమా తీయడానికి చాలా గట్స్ కావాలి. మీడియా ని తూర్పారబెట్టి అందులో జరుగుతున్న దారుణాలూ , ఘోరాలూ చూపించాలి అంటే ఆ డైరెక్టర్ కి చాలా సీన్ ఉండాలి. ఎక్కడైనా తేడా వచ్చినా ఎవ్వరినైనా విమర్శించినా , ఎక్కడైనా పేర్లు వాడినా ఈ సినిమాని కాదు కదా ఫ్యూచర్ లో ఒచ్చే సినిమాలని కూడా తొక్కేస్తారు మీడియా జనాలు. ఆ బ్యానర్ , ఆ డైరెక్టర్ , ఆ హీరో , ఆ వర్గం వీరందరినీ మనసులో నోట్ చేసుకుని ఎక్కడ తొక్కలో అక్కడ తొక్కుతారు.

 

ఎందుకంటే ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు జర్నలిజం పరిస్థితి. అడ్డదారులు తొక్కడం , బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఒక మాఫియా లాగా తయారు అయ్యింది మీడియా. కానీ ఆ విషయం ఎవరైనా బయటకి అంటే మీడియా ఉలిక్కి పడుతుంది. అలా చెప్పడానికి ఒప్పుకోదు. అప్పట్లో రణ్ అనే సినిమా తీసి తన గట్స్ తో అదంతా బయటపెట్టాడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అమితాబ్ బచ్చన్ - సుదీప్ ప్రధాన పాత్రలు చేసిన ఆ సినిమా అప్పట్లో బాలీవుడ్ లో హిట్ అయినా తెలుగులో , తమిళ్ లో , కన్నడ లో పెద్దగా ఆడలేదు. ఆ సినిమాలో మీడియా చేసే అరాచకాలు, ఎవరిని ఏ రకంగా తోక్కేస్తున్నారు అన్నీ చూపించాడు వర్మ.

 

పబ్లిసిటీ కోసం మీడియా ఎంత మేరకి దిగజారిపోతుంది అనేది కళ్ళకి కట్టాడు. ఆ సినిమా తరవాత వర్మ రేంజ్ లో ఎవ్వరూ సాహసం చెయ్యలేకపోయారు. ఇప్పుడు ఇన్నేళ్ళ తరవాత అంటే ఒక దశాబ్ద కాలం తరవాత మళ్ళీ మీడియా కి వ్యతిరేకంగా " మనలో ఒకడు " అనే సినిమా సిద్దం అవుతోంది. ఆర్పీ పట్నాయక్ హీరోగా ఆయనే డైరెక్ట్ చేసిన ఈ సినిమా మీడియా ని టార్గెట్ చేస్తూ సాగాబోతోంది. ట్రైలర్ విడుదల అయిన కొన్ని గంటల్లోనే వేలాది లైక్స్ ని పొందింది. బ్రోకర్ సినిమా తో మంచి పేరుతెచ్చుకున్న ఆర్పీ ఆ సినిమాని కమర్శియల్ గా ఆడించుకోలేక పోయాడు. దానికి ప్రధాన కారణంగా పబ్లిసిటీ అని చెప్పాలి. బ్రోకర్ సినిమాకి మౌత్ టాక్ తప్ప సినిమాకి ప్రమోషన్ లేదు , సినిమా వెళ్ళిపోయిన తరవాత చాలా మంది యూ ట్యూబ్ లో చూడడం తప్ప డైరెక్ట్ గా ఎవ్వరికీ ఈ సినిమా థియేటర్ లో చూసిన ఎక్స్ పీరియన్స్ లేదు. అందుకే ఈ సారి పక్కాగా పకడ్బందీ గా ' బ్రోకర్ ' డైరెక్టర్ నుంచి వస్తున్న చిత్రం అంటూ ' మనలో ఒకడు ' ప్రోమోట్ చేస్తున్నాడు ఆర్పీ.

 

మీడియా కి యాంటీ గా సినిమా తీస్తూ స్వయంగా మీడియా టైకూన్ రామోజీ రావు చేతుల మీదగా ఈ సినిమా టీజర్ లాంచ్ చేయించాడు అంటే మనోడు ధైర్యం చూడండి మరి. ఈ సినిమాలో విలన్ గా సాయి కుమార్ సాగుతూ ఉండగా, ఒక సామాన్య వ్యక్తిగా ఆర్పీ కనిపిస్తాడు. డైరెక్టర్ గా హిట్టు కొట్టాలి అని పట్టు వదలని విక్రమార్కుడిలా ఆర్పీ పట్నాయక్ తన ప్రయత్నాలు యేవో తాను చేస్తున్నాడు మరి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: