ప్ర‌ముఖ సినీ న‌టి, ద‌క్షిణాది పేరుగాంచిన‌ అమలాపాల్  విడాకుల‌ వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతోంది.  ప్ర‌ముఖ తమిళ నిర్మాత విజ‌య్ తో గ‌త ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిరువురు తాజాగా విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కారు. ఇక‌పోతే అమ‌లాపాల్ ఎమంటా కోర్టు మెట్లెక్కిందో ఆమెకు వ‌చ్చిన సినీమా ఆప‌ర్ కూడా పొగొట్టుకుంది. అయితే తాజా గా అమ‌లాపాల్... విజ‌య్ తో ఎందుకు విడాకులు తీసుకుంటు న్నారో అన్న సందేహం అటు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మేకాకుండా దేశంలో అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ లోకం చెవులు కోరుక్కున్నారు. అయితే తాజాగా  ఓ విస్తూపోయే నిజం త‌మిళ ఇండస్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే ఈ వార్త నిజామా? అనేది మాత్రం తెలియ‌రాలేదు. 

అమ‌లా పాల్ ను నిల‌దీసిన విజ‌య్...

త‌మిళ మీడియా వర్గాల ప్ర‌కారం... అమ‌లాపాల్ బ్రేక‌ప్ కు కార‌ణం... ఆమె ఓ యువ నిర్మాత‌తో రాత్రంతా  గ‌డ‌ప‌ట‌మే అంటున్నారు. ఈ విష‌యం తెలుసుకున్న ద‌ర్శ‌కుడు విజ‌య్... చాలా అప్ సెట్ అయ్యాడ‌ని చెప్తున్నారు. ఆ యువ నిర్మాత‌తో అమ‌లాపాల్ ఫ్రెండ్లీగా ఉండేద‌ని... ఊహించ‌ని విధంగా అత‌నితో ఓ రాత్రంతా గ‌డ‌ప‌టం మాత్ర త‌ట్టుకోలేని విష‌యం అని, అయితే ఈ విష‌యం విజ‌య్ బ‌య‌ట‌కు చెప్పుకోలేదని అంటున్నారు. ఈ విష‌యంపై అమ‌లాపాల్ ను భ‌ర్త నిర్మాత విజ‌య్ నిల‌దీసారని... ఆమె ఇచ్చిన స‌మాధాన‌మే విడాకుల‌కు కార‌ణ‌మైంద‌ని చెప్పుకుంటున్నారు. ఈ విష‌యంపై అమ‌లాపాల్ మాత్రం మీడియా ముందుకు రావ‌టానికి ఇష్ట ప‌డ‌టం లేదు. ఇక‌పోతే నిర్మాత ఎల్ విజ‌య్ సైతం మీడియా  కు అందుబాటులో లేరు.

అమ‌లా పాల్ కేరీర్  వెన‌క్కి నేట్టే ప్ర‌య‌త్నాలు...

వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు మాట్లాడితే త‌ప్ప ఇందులో నిజానిజాలు ఎంత అనేది మాత్రం తెలియ‌దు.  ఇదీలా ఉంటే మ‌రో వైపు అమ‌లా పాల్ కెరీర్ ప‌రంగా వెన‌క్కి నెట్టే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నట్లు ఆమె స‌న్నిహిత వ‌ర్గాల చెప్పుకుంటున్నారు. అమ‌లాపాల్ అలాంటి వ్య‌క్తి కాద‌ని... ఆమె పై వ‌స్తున్న రుమార్లు కేవ‌లం కల్పితాలేన‌ని కొట్టి ప‌డేస్తున్నారు. మ‌రీ దీని పై మాత్రం అమ‌లాపాల్ స్పందించ‌డం లేదు. అయితే విజ‌య్ తండ్రి తో అమ‌లాపాల్ త‌గువు పెట్టుకున్నందుకే  ఆమెను దూరంగా పెట్టాల‌ని సీనియ‌ర్ నిర్మాత‌లు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఈ రుమార్లకు ఎప్పుడు తెర ప‌డ‌నుందో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: