ఇండియన్ సూపర్ స్టార్ గా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్న హీరో సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకాంత్ ఫిల్మ్ కెరీర్ ని ప్రారంభించినప్పటి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏ స్టార్ కి లేని స్టార్ డం ని కైవసం చేసుకున్నాడు. యాక్టింగ్ కి తన వయస్సు సహకరించకపోయినప్పటికీ...తను నటిస్తే ఆ సినిమాని రికార్డ్స్ కి ఎక్కేంతగా అభిమానులు సక్సెస్ ని ఇస్తుంటారు.


ఇదిలా ఉంటే రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కబాలి. ఈ మూవీ ఇండియన్ బాక్సాపీస్ ని షేక్ చేసిందని చెప్పవచ్చు. అయితే కబాలి చిత్రం ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. కబాలి చిత్రాన్ని కేవలం మార్కెటింగ్ చేసుకునే ఉద్ధేశంతోనే ఆ చిత్ర నిర్మాత, దర్శకులు ఆలోచనలు చేశారనేది ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న నిరసన. ఇక ఈ తరహా కథలకి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడ ఏ మాత్రం అభిమానులకి రుచించటం లేదు.


అయితే తాజాగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని రజనీకాంత్ సీనియర్ అభిమాన సంఘాలు...ఈ హీరోపై అంతగా ఆసక్తి చూపటం లేదు. తమిళనాడు రాజకీయాల్లో కీలకం కావాల్సిన వ్యక్తి...కేవలం సినిమాలకే పరిమితం అవుతూ, తమిళనాడు సమస్యలపై బాహాటంగా పోరాడకుండా ఉండటం నిజమైన తమిళనాడు ప్రజలకి ఏ మాత్రం సహించటం లేదు. తమిళుల సమస్యలపై రజనీకాంత్ ఏనాడు పోరాడలేదనే ముద్ర అక్కడ బాగా పెరుగుతుంది.


కేవలం రజనీకాంత్ తన ఆస్తిని పెంచుకోవటం కోసం సినిమాల్లో ఉన్నారంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న వాదన. అలాగే రజనీకాంత్ కి ఉన్న ఆస్తులు సైతం తన స్వస్థలం రాష్ట్రం అయిన కర్ణాటకలోనే ఎక్కువుగా పెట్టుకున్నారనే అపవాదు కూడ రజనీకాంత్ పై ఉంది. ఇలా రజనీకాంత్ పై తమిళనాడులో రోజు రోజుకి ఫాలోయింగ్ తగ్గుతుందని అంటున్నారు. కబాలి విషయంలో ఫ్యాన్స్ ని రజనీకాంత్ బాగా మోసం చేశాడని అంటున్నారు. దీంతో రజనీకాంత్ నుండి వచ్చే అప్ కమింగ్ చిత్రాల విషయంలో ప్రకటనలను చూసి మోసకపోకూడదనే నిర్ణయానికి కొంత మంది అభిమానులు వచ్చారనే ఓపెన్ టాక్స్ అక్కడ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: