ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఆఫర్స్ ని అందుకున్నప్పుడు కచ్ఛితంగా రొమాంటిక్ సీన్స్ లో నటించాల్సి ఉంటుంది. ఆ సమయంలో హీరోయిన్స్ పెట్టుకున్న కండిషన్స్ ని కాస్త పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ విమలా రామన్ ఓ మూవీకి సంబంధించిన విషయంలో హీరోకి చాలా స్ట్రిక్ట్ గా సమాధానం చెప్పిందట.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, విమలా రామన్ ప్రస్తుతం హిందీ, మలయాళం, తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తుంది. గతంలో విమలా రామన్ ఎక్స్ పోజింగ్ చేసినప్పటికీ..ప్రస్తుతం మాత్రం గతంలో చేసినంత హాట్ ఎక్స్ పోజింగ్ ని చేయను అని అంటుందట. అయితే తను ఒప్పుకున్న ఓ తమిళ మూవీ విషయంలో హీరోతో పలు సీన్స్ లో లిప్ లాక్స్ ఉన్నాయి. మూవీలో లిప్ లాక్స్ ఉన్నాయన్న సంగతి హీరోయిన్ కి షూటింగ్ స్టార్ట్ అయ్యేంత వరకూ తెలియదంట.

ఇక ఒకటి రెండు సీన్స్ కి అయితే ఓకె అని చెప్పిన విమలా రామన్ తో, ఎక్కువ సార్లు లిప్ లాక్ సీన్స్ ని చేయిస్తున్నారు. దీంతో విసుగు చెందిన విమలా రామన్, హీరోకి, డైరెక్టర్ కి గట్టి వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. రెండు సీన్స్ కి మించి తను లిప్ లాక్స్ సీన్స్ లో నటించను...అంతకి మించి పెదాలను టచ్ చేసే సీన్స్ ని పెడితే సినిమా నుండి తప్పుకుంటానని చెప్పుకొచ్చింది. దీంతో డైరెక్టర్ సైతం కాస్త తగ్గి.. విమలా రామన్ కి అనుగుణంగా సీన్స్ ని పెట్టుకోవటం జరిగింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం విమలా రామన్ తెలుగులోనూ ఓ భక్తి చిత్రంలో నటిస్తుందన్న విషయం తెలిసిందే. 'ఓం నమో వెంకటేశాయ' చిత్రంలో లక్ష్మీదేవి పాత్రలో కనిపించనుంది. అలాగే తనకి వచ్చిన భరతనాట్యం ని ఈ సినిమా కోసం ఉపయోగిస్తానని చెప్పుకువస్తుంది. ఇక రాఘవేంద్రరావు సైతం విమలా రామన్ తో మంచి పెర్ఫార్మెన్స్ ని తీసుకోనున్నారని అంటున్నారు. నాగార్జున సైతం విమలా రామన్ పాత్రకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగిందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: