ఈ మాట అంటుంది ఎవరో కాదు ఆ మద్య కొత్త జంట అంటూ వచ్చి..ఈ మద్య శ్రీరస్తు శుభమస్తుతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్. సైమా అవార్డు సందర్భంగా మాట్లాడుతూ..  అన్నయ్య బన్నీ ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టి ఓ అమ్మాయిని పడేశానని అల్లు శిరీష్ స్వయంగా చెప్పుకొచ్చాడు. అది కూడా ఎక్కడో కాదు. ఇటీవల జరిగిన సైమా అవార్డ్ ఫంక్షన్‌లో. ఈ వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మంచు లక్ష్మి వద్దకు వెళ్లిన శిరీష్ ఫేస్‌బుక్‌లో తానో అమ్మాయిని పడేశానని, అయితే ఆమెతో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయంగా ఉందన్నాడు.
Image result for siima awards 2016 allu sirish manchu laxmi
దీనికి స్పందించిన లక్ష్మి ‘‘ఇంతకీ ఫేస్‌బుక్‌లో నీ ఫొటోనే పెట్టావా?’’ అని ప్రశ్నించింది. ‘‘నా ఫొటో ఎందుకు పెడతా.. బన్నీ ఫొటో పెట్టి పడేశా’’ అని నవ్వులు పూయించాడు. అయితే అమ్మాయితో చాట్ చేస్తుంటే బాగానే ఉందని చెప్పిన శిరీష్.. ఆ అమ్మాయి ‘లెట్స్ టాక్ ఇన్ ద ఫోన్’ అనడంతో భయం పట్టుకుందన్నాడు.

తన ఇంగ్లిష్ వింటే ఆ అమ్మాయికి తనపై ఉన్న ఇంప్రెషన్ పోతుందని, తనకు అమెరిక్ ఇంగ్లిష్ నేర్పించాలని లక్ష్మిని అభ్యర్థించాడు. దీంతో లక్ష్మి ‘వాటర్’, ‘ఐ లవ్య్యూ’ అన్న పదాలు పలకడమెలాగో నేర్పించింది. ఆ తర్వాత మరో రెండు పదాలు గురించి వివరించింది. అంతే అమెరికన్ యాక్సెంట్‌ను పట్టేశానని, ఇక అమ్మాయిని లైన్లో పెట్టేస్తానంటూ అందరినీ నవ్వుల్లో ముంచెత్తాడు శిరీష్.


మరింత సమాచారం తెలుసుకోండి: