‘శ్రీరస్తు శుభమస్తు’ సూపర్ సక్సెస్స్ తరువాత అల్లు శిరీష్ క్రేజ్ బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే శిరీష్ కూడ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ అదేవిధంగా సోషల్  మీడియాలో లైవ్  చాట్  చేస్తూ  తన క్రేజ్ పెంచుకోవడానికి శిరీష్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈనేపధ్యంలో ఈ మధ్య ఒక ఛానల్ టెలికాస్ట్ చేసిన ఒక కార్యక్రమంలో మంచులక్ష్మి శిరీష్ ని ఆట పట్టిస్తూ వేసిన సెటైర్ చూసి చాలామంది ఆశ్చర్య పోయారు. 

లక్ష్మి ఇంగ్లీష్ యాక్సెంట్ గురించి కొత్తగా చెప్పవలసిన పనిలేదు.  అమెరికన్ ఇంగ్లీష్  యాసను  తెలుగులో మిక్స్ చేస్తూ ఆమె మాట్లాడే వాచకం ఒక స్పెషల్. నిజానికి అది కాస్త ఫన్నీగా అనిపించినా జనానికి అలవాటు అయిపోవటంతో ఆమె అలానే కంటిన్యూ చేస్తోంది.  అయితే మంచు లక్ష్మి దగ్గర ఇంగ్లీష్ ట్యూషన్ చెప్పించుకొని మరీ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అల్లువారి చిన్నబ్బాయి శిరీష్ ఒక ఛానల్ ప్రససారం చేసిన ఒక కార్యక్రమంలో ప్రయత్నించాడు.   

అయితే ఈ ట్యూషన్ కు ఒక కారణం ఉంది.  ఫేస్ బుక్ లో తనకు పరిచయమైన ఒక అమ్మాయిని లైన్ లో  పెట్టడానికి తాను అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లడవలిసి వస్తోంది కాబట్టి తనకు అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడటంలో ట్రైనింగ్ ఇమ్మని శిరీష్ మంచు లక్ష్మిని అడిగినప్పుడు ఆమె వెంటనే నవ్వుతూ ఫేస్ బుక్ లో 'నీ ఫొటోయే పెట్టావా?' అంటూ సెటైర్ వేసింది. ఆ ప్రశ్నకు శిరీష్ సమాధానం ఇస్తూ బన్నీ ఫొటోను పెట్టి ఆ అమ్మాయిని పడేశానని శిరీష్ చెప్పాడు. 

అంతేకాదు ఛాట్ చేస్తున్నంత సేపు బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి 'లెట్స్ టాక్ ఇన్ ద ఫోన్' అనగానే భయం పట్టుకుందని శిరీష్ అన్నాడు. ఆమె తన ఇండియన్ ఇంగ్లీష్ విని తాను తెచ్చుకున్న ఇంప్రెషన్ పోతుందేమోనని డౌట్ రావడంతో తనకు అమెరికన్ ఇంగ్లీష్ చెప్పమని శిరీష్ నవ్వుతూ లక్ష్మిని అడిగాడు. 

దానితో లక్ష్మి 'ఐ లవ్ యూ' అన్న పదాన్ని అమెరికన్ స్టైల్ లో ఎలా పలకాలో శిరీష్ కు పట్టిపట్టి నేర్పించింది. ఇది అంతా ఈ మధ్య ఒక ఛానల్ ప్రసారం చేసిన సైమా అవార్డ్ ఫంక్షన్‌లో జరిగిన సంఘటన. అయితే ఈ కార్యక్రమం జరిగి చాలా రోజులే అయినా ఈ కార్యక్రంలో మంచు లక్ష్మి శిరీష్ పై వేసిన పంచ్ లేటెస్ట్ గా వెలుగు చూడటంతో ఆ పంచ్ గురించి ఇప్పుడు చాలామంది జోక్ చేసుకుంటూ శిరీష్ పడ్డ అవస్థలు గురించి చర్చించుకుంటూ నవ్వుకుంటున్నారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: