నిత్యామీనన్ ఏ విషయం పై అయినా చాల ఘాటుగా స్పందిస్తుంది. ఎటువంటి మొహమాటాలు లేకుండా ఆమె టాప్ హీరోల పై చేసే కామెంట్స్ వల్ల ఆమెకు సినిమాలలో ఆమెకు తగ్గ అవకాశాలు రావడం లేదు అన్న కామెంట్స్ ఇప్పటికే వచ్చాయి.  అయితే ఇటువంటి విషయాలను ఆమె పెద్దగా పట్టించుకోదు.  ఈ నేపధ్యంలో ఆమె లేటెస్ట్ గా ‘జనతా గ్యారేజ్’ పై చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి.

‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు ఇక వారం రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో నిన్నటి నుంచి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.  ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిత్యామీనన్ ఇంటర్వ్యూను నిన్న ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసింది.  ఈ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఆ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న ప్రోగ్రాం ప్రజెంటర్ నిత్యామీనన్ ను ‘జనతా గ్యారేజ్’ లోని తన పాత్ర గురించి చెప్పమని అన్నప్పుడు నిత్యామీనన్ కొన్ని ఆ సక్తికర కామెంట్స్ చేసింది.

ప్రస్తుతం చాలామంది ఈసినిమా జూనియర్ సమంతల సినిమా మాత్రమే అనుకుంటున్నారని అయితే అది వాస్తవం కాదని ఈ సినిమాలో తనది చాల కీలక పాత్ర అని చెపుతూ సినిమా కథకు ట్విస్ట్ ఇచ్చే పాత్రలో తాను నటించిన విషయాన్ని బయట పెట్టింది నిత్యామీనన్.  అయితే ఈ సినిమా పబ్లిసిటీలో తన పేరుకన్నా ఎక్కువగా సమంత పేరు వాడుతూ ఉండటంతో చాలామందికి ఇది కేవలం సమంత జూనియర్ ల సినిమానే అనుకుంటున్నారని అంటూ నవ్వుతూ చురకలు అంటించింది నిత్యామీనన్.

ఈ మాటలు బట్టి నిహ్యామీనన్ ‘జనతా గ్యారేజ్’ పై అసంతృప్తిగా ఉందా ? లేదా ఈ సినిమా పబ్లిసిటీలో తన పెరుకన్నా ఎక్కువగా సమంత పేరును వాడటంతో నిత్యామీనన్ షాక్ అయి ఈవిధంగా కామెంట్స్ చేసిందా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు ఇదే ఇంటర్వ్యూలో నిత్యామీనన్ మాట్లాడుతూ ఒక సీన్ లో తాను ఎలా నటించాలి అని జూనియర్ ను అడిగినప్పుడు జూనియర్  తనను విపరీతంగా పొగుడుతూ మీరు ఎలా నటించినా చాల బాగుంటుంది అని కామెంట్స్ చేసిన విషయాన్ని బయట పెట్టింది.

ఈ కామెంట్స్ నిత్యామీనన్ నోటి వెంట విన్న వారికి తాను నటనలో చాల పరిపక్వత చెందాను అన్న అర్ధం ఆమె మాటలు విన్న ఎవరికైనా స్పురిస్తుంది.  అయితే నిత్యామీనన్ ఒకవైపు జూనియర్ ను తెగ పొగుడుతూ మరోవైపు సమంతను కార్నర్ చేస్తూ తాను కూడ సమంతకు ఏ విధంగాను తీసిపోను అనే సంకేతాలను ఈ ఇంటర్వ్యూలో ఇచ్చింది నిత్యామీనన్.

రేపు నిత్యామీనన్ నటించిన ‘100 డేస్ ఆఫ్ లవ్’ విడుదల కాబోతోంది.  ఈ సినిమా పై కూడ మంచి అంచనాలు ఉన్నాయి.  ఈ సినిమా విడుదలై  ఒక వారం తీరకుండానే ఈమె నటించిన ‘జనతా గ్యారేజ్’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిత్యామీనన్ హవానే కనపడుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: