స్టార్ హీరోగా ఉన్నప్పుడు ఎవరితో ఎలా ఉండాలో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో బాగా తెలిసుండాలి. తానో స్టార్ హీరో కాబట్టి బయట కూడా హీరోలా ఉటానంటే తగదు మరి. అయితే రెండు మూడు షాకులు తగిలితే ఎవరికైనా అసలు విషయం అర్ధమవుతుంది. ఈ మధ్య మెగా పవర్ స్టార్ రాం చరణ్ ప్రవర్తన అందరికి షాక్ ఇస్తుంది. ఎంతో మెచ్యుర్డ్ గా ఆలోచిస్తున్న చెర్రి తీరు అందరిని ఇంప్రెస్ చేస్తుంది.


ముఖ్యంగా కెరియర్ మొదట్లో సూపర్ హిట్స్ కొట్టడం ఇంకా వెనుక మెగాస్టార్ ఉన్నాడనే ధీమాతో మీడియాతోనూ పబ్లిక్ తోనూ దురుసుగా ప్రవర్తించిన చరణ్ ఈరోజు చాలా మారిపోయాడని చెప్పాలి. సాధారణంగా మీడియా స్టార్ హీరోల విషయంలో ఎక్కడో ఓ చోట అసంతృప్తి వెళ్లగక్కుతుంది. అయినా సరే దాన్ని ఉదారంగా ప్రభావిత పరచాలి.  


రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సెలబ్రిటీ పార్టీలో మీడియా వారిని అవమాన పరచారని తెలుసుకున్న చరణ్ మీడియా మిత్రులందరికి సారీ చెప్పేశాడు. చెర్రి చెప్పిన సారీ అనే పదం అందరిని ఆశ్చర్యంలో ముచెత్తింది. ఇలాంటి విషయాల్లో ఇదవరకు తలబిరుసు తనంతో ప్రవర్తించిన చరణ్ ఒకేసారి ఇంతలా మార్పు చెందాడేంటి అని అందరు షాక్ అవుతున్నారు.


అప్పట్లో పబ్లిక్ గా ఓ నెటిజెన్ తో గొడవ పడి బయట హీరోయిజం చూపించాలని చూసిన చరణ్ కు ఇప్పుడున్న చరణ్ కు చాలా చేంజెస్ వచ్చాయని చెప్పొచ్చు. తన మీద విమర్శలు వచ్చినా సున్నితంగా మాట్లాడుతుండటంతో చెర్రిలోని ఈ మార్పును అందరు మెచ్చుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే తని ఒరువన్ రీమేక్ ధ్రువగా రాబోతున్న చరణ్ ఆ సినిమాలో సరికొత్త గెటప్లో కనిపిస్తున్నాడు. అక్టోబర్ మొదటి వారంలో ధ్రువ రిలీజ్ చేసి కొద్దిపాటి గ్యాప్ తోనే సుకుమార్ డైరక్షన్లో సినిమాకు సిద్ధమయ్యే ఆలోచనలో ఉన్నాడు రాం చరణ్.  



మరింత సమాచారం తెలుసుకోండి: