పాలమీగడ లాంటి మృధుమధుర అందాల భామ 'దేశముదురు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన బొద్దు గుమ్మ (అప్పుడు ముద్దుగుమ్మ) హన్సిక. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ అందాల పాపకు వరుస అవకాశాలు వచ్చాయి. కంత్రి, మస్కా, బిల్లా, జయీభవ, సీతారాముల కళ్యాణం లంకలో, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దూసుకెళ్తా వంటి సినిమాల్లో కథానయకిగా నటించి వొకవెలుగు వెలిగింది.

 Image result for most beautiful hansika

ఆ తరువాత సినిమాలు అంతగా విజయవంతం కాకపోవటంతో ఈ అమ్మడుకి అవకాశాలు తగ్గడం ఆతరవాత తమిళ సినిమా పరిశ్రమకు మారిపోవటం జరిగింది. అక్కడ హన్సిక నటించిన సినిమాలు వరుసగా సూపర్ హిట్ కావడంతో వరుస పెట్టి అవకాశాలు వచ్చాయి. దీంతో హన్సిక పూర్తిగా తెలుగు సినిమాల్లో కనిపించటం మానేసింది. తమిళ పరిశ్రమలో దాదాపు నాలుగేళ్లు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అక్కడ బొద్దుగుమ్మలకే డిమాండ్ ఎక్కువకదా! కుష్బూ, నమిత ఇలా మన హన్సిక కూడా! 2014లో రవితేజ 'పవర్' సినిమా నే ఆమే చివరి తెలుగు సినిమా. దానితరవాత ఇక్కడ అంత ప్రోత్సాహం కనిపించ్చకపోవటంతో మళ్ళీ తమిళంలోకి వెళ్ళిపోయింది.

 Image result for most beautiful hansika

అయితే ఇప్పుడు ఈ అమ్మడుకి తమిళంలో కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టటంతో మళ్ళీ తెలుగులో తన అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చేసింది. అయితే ఈ అమ్మడు తమిళంలో తీసుకునే పారితోషికంలో సగం మాత్రమే తెలుగు సినిమాకి తీసుకుంటుంది. కారణం వయసు, సైజు  పెరగటం. దీంతో ఈ అమ్మడుకి అవకాశాలు మళ్ళీ వరద వస్తుంది. డిస్కౌంట్ సేల్ కు కొన్ని సార్లు అలాగే కలసి వస్తుంది.

Image result for most beautiful hansika

ఇప్పటికే గోపీచంద్-సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హన్సిక హీరోయిన్ గా ఎంపికైంది, మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రంలో కూడా హన్సికనే కథానాయకిగా కంఫర్మ్ చేసుకున్నారు. దీంతో ఈ అమ్మడుకి మళ్ళీ తెలుగులో పూర్వ వైభవం ఖాయమంటున్నారు. అందగత్తె అందులో అర్ధ పారితోషికం ఇంకేం అంతున్నారు సినీ పండితులు.

Image result for most beautiful hansika

మరింత సమాచారం తెలుసుకోండి: