మరి కొన్ని గంటలలో పవన్ బహిరంగ సభ తిరుపతి ‘ఇందిరా మైదానం’ లో జరగబోతున్న నేపధ్యంలో ఈ సభను విజయవంతం చేయడానికి పవన్ ఫోర్స్ రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.  పవన్ ఈ బహిరంగ సభ వేదిక పై మాట్లాడుతూ ఉన్నంత సేపు ఒక వలయం లా ఏర్పడి పవన్ వీరాభిమానులు కొంత మంది పవన్ ఫోర్స్ లా మారి వేదిక పైకి పవన్ అభిమానులు వచ్చి పవన్ ఉపన్యాస ఏకాగ్రతను భంగ పరచకుండా  ఈ బహిరంగ సమావేశాన్ని సజావుగా నడిపించడానికి పవన్ ఫోర్స్ చాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈరోజు జరగబోయే సమావేశానికి పోలీసు శాఖ నుండి అనుమతి వచ్చినా ఈ బహిరంగ సమావేశంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగాకుండా తాను చూసుకుంటానని పవన్ మాట ఇవ్వడంతో ఈ సమావేశ నిర్వహణా బాధ్యతను పవన్ ఫోర్స్ చాల బాధ్యతాయుతంగా నిర్వహించబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.  నిన్న రాత్రి పవన్ చాల పొద్దుపోయే వరకు తిరుమల కొండ పై సుబ్బిరామిరెడ్డి గెస్ట్ హౌస్ లో ఉన్న పవన్ తన సన్నిహితులతో ఒక్క క్షణం తీరిక లేకుండా ఈరోజు తన ఉపన్యాసంలో మాట్లాడబోయే విషయాల గురించి చాల భారీ కసరత్తులు చేసినట్లు టాక్. 

నిన్న ఉదయం నుంచి పవన్ తన గెస్ట్ హౌస్ నుంచి ఒక్కసారి కూడ బయటకు రాలేదు అని తెలుస్తోంది.  పవన్ గెస్ట్ హౌస్ బయటకు వస్తాడు అని వేలాది మంది పవన్ అభిమానులు ఎదురు చూసినా పవన్ ఒక్కసారి కూడ బయటకు రాకుండా ఈరోజు ఉపన్యాసంలో మాట్లాడవలసిన విషయాల గురించి చాల లోతుగా పవన్ కు సన్నిహితంగా ఉడే కొంతమంది మేధావులతో కూడ తన వ్యక్తిగత టెలిఫోన్ నుండి సంభాషించినట్లు టాక్.

తిరుపతి ‘జనసేన’ పార్టీ నాయకులు మీడియాకు ఇస్తున్న లీకుల ప్రకారం పవన్ తన వ్యవహార శైలికి భిన్నంగా ఎటువంటి ఆవేశం లేకుండా అటు భారతీయ జనతా పార్టీని ఇటు తెలుగు దేశం పార్టీని కార్నర్ చేస్తూ కొన్ని ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ సమస్యలకు సంబంధించి ప్రశ్నించి తన పై ఇప్పటి వరకు ప్రశ్నించడం లేదు అన్న అపవాదు నుండి బయట పడటానికి చాల సీరియస్ హోమ్ వర్క్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనికితోడు ఇదే వేదిక పై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ‘జనసేన’ జిల్లా ఇంచార్జుల పేర్లను పవన్ ప్రకటించి ‘జనసేన’ పార్టీని జనంలోకి తీసుకు వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాడని టాక్.

నిన్న రాత్రి పవన్ తిరుపతిలో పూర్తిస్తున్న రాజకీయ శంఖారావం పై ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టి కార్యక్రమంలో తిరుపతి పట్టణానికి చెందిన ‘జనసేన’ పార్టీ నాయకులు కూడ పాల్గొని పవన్ గర్జించబోతున్నాడు అన్న లీకులు ఇచ్చారు.  అయితే ఈ చర్చా గోష్టిలో పాల్గొన్న కొందరు విశ్లేషకులు మాత్రం పవన్ కళ్యాణ్ చాల హడావిడిగా ఈ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి తొందర పడ్డాడు అని ఓపెన్ గానే కామెంట్స్ చేయడం మరొక ట్విస్ట్.

అయితే ఒకప్పుడు నందమూరి తారకరామారావు మధ్యలో చిరంజీవి ఇప్పుడు పవన్ కళ్యాణ్ లు తమ పొలిటికల్ ఎంట్రీకి తిరుపతి బహిరంగ సభనే వేదికగా ఎంచుకోవడం వెనుక ఒక బలమైన సెంటిమెంట్ కనిపిస్తోంది.  రేపు ఉదయం పవన్ శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొని ఆ తరువాత పూరించబోయే రాజకీయ శంఖారావం పైనే అందరి దృష్టి ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: