టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పవన్ ఫ్యాన్ హత్యకు సంబంధించిన వార్తలు మాత్రమే.  ఈ సంఘటనతో అటు పవన్ ఇటు జూనియర్ లు ఇద్దరూ విపరీతమైన ఒత్తిడిలో పడ్డారు.  అశలు తన  ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనకు ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితిలో జూనియర్ తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్. 

ఒక వైపు ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ పనులలో బిజీగా ఉన్న జూనియర్ ఈ విషయానికి సంబంధించిన ప్రతీ విషయాన్ని చాలా లోతుగా విశ్లేషన చేస్తున్నట్లు తెలుస్తోంది.   చనిపోయిన వ్యక్తి పవన్ అభిమాని కావటం ఆయన పార్టీ కార్యకర్త కూడ కావటంతో పవన్ కాస్త త్వరగానే స్పందించాడు.  వెంటనే తిరుపతి వెళ్ళి మరణించిన వినోద్ కుటుంబాన్ని ప్రత్యక్షంగా ఓదార్చటమే కాకుండా ఈకేసు విషయంలో తన పూర్తి సహకారం ఉంటుందనీ హామీ ఇచ్చాడు. 

ఆర్థికంగా కూడా ఆదుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే ఈ సంఘటనతో టెన్షన్ పడుతున్నది జూనియర్ మాత్రమే అని అంటున్నారు.  ఈ విషయం పైన వెంటనే స్పందించి తిరుపతి వెళ్ళినా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో మంచికన్నా చెడు ఎక్కువ జరుగుతుందని జూనియర్ వెనకడుగు వేసినట్లు టాక్. 

ఈ పరిస్థితులలో మీడియాలో ఏదైనా ప్రకటన చేద్దామా అనుకునే లోగానే మీడియాలో హత్య చేసిన వ్యక్తి జూనియర్ అభిమాని అని వార్తలు రావడంతో  తన అభిమాని అని చెప్పుకునే వ్యక్తి ఒక నేరం చేస్తే దానికి అసలేవిధంగా సమాధానం చెప్పుకోవాలో అర్థం కాని విచిత్ర పరిస్థితులలో జూనియర్ కార్నెర్ అయ్యాడు అన్న వార్తలు వస్తున్నాయి.

 ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా పవన్ ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఫ్యాన్స్ అంటూ బ్రేకింగ్ న్యూస్లు  టెలికాస్ట్ కాబడటం జూనియర్ కు తీవ్ర అసోకర్యంగా మారింది అని టాక్. 
ఇప్పటికే పోలీసులు రంగంలోకి దిగిన నేపధ్యంలో  ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో సేకరించిన తరువాత మాత్రమే స్పందించాలని జూనియర్ ఆలోచన చేస్తున్నట్లు టాక్.  ఇప్పటికే  ఈ విషయమై ఆరోజు ఏమిజరిగింది అనే విషయం  పై లోతుగా వివారాలు రాబట్టమని జూనియర్ కొందరు వ్యక్తులకు ప్రత్యేక బాధ్యతలు అప్ప చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.  

జూనియర్ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఈ విషయంపై ప్రశాంతత కోల్పోయి ఒక విధమైన అయోమయ పరిస్థితిలో  ఉన్నాడని తెలుస్తోంది.  ఒకవేళ  ఈ విషయం పై ఒకవేళ స్పందిచ వలిసి వస్తే ఎలా వ్యుహాత్మకంగా  స్పందించాలో అన్న విషయమై జూనియర్ తన సన్నిహితులతో చాలా లోతుగా చర్చిస్తూ ఒక వైపు తన ‘జనతా గ్యారేజ్’  ప్రమోషన్ పనులు మరో వైపు ఈ అనుకోని పరిస్థుతుల  మధ్య  తారక్ నలిగి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఈ విషయమై పవన్ మాట్లాడే జూనియర్ మాట్లాడక  పోవడం ఒక విధంగా జూనియర్ కు మరోక  కొత్త  తల నొప్పి అనుకోవాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: