నిన్న సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘జనతా గ్యారేజ్’ యూనిట్ లేటెస్ట్ గా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్లలో ఈరోస్ సంస్థ లోగో కనిపించడం అందర్నీ ఆశ్చర్య పరిస్తే జూనియర్ అభిమానులను టార్చర్ పెడుతోంది.  ఫిలింనగర్ లో లేటెస్ట్ గా వినపడుతున్న వార్తల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ‘జనతా గ్యారేజ్’ హక్కులను ఈరోస్ సంస్థ పొందడమే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఈరోస్ విడుదల చేస్తోంది అని తెలుస్తోంది.

ఇప్పుడు ఈ విషయమై జూనియర్ అభిమానులకు విపరీతమైన టార్చర్ పెడుతున్నట్లు టాక్.  మహేష్ ‘1 నేనొక్కడినే’ నుండి ఈ సంవత్సరం వచ్చిన పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ వరకు ఇలా అన్ని భారీ సినిమాలను భారీ రేట్లకు కొన్న ఘనత ఈరోస్ సంస్థకు ఉంది.  ఆఖరికి ఈ సంక్రాంతికి వచ్చిన బాలయ్య ‘డిక్టేటర్’ ను కూడ ఈరోస్ విడుదల చేసింది.

అయితే ఈరోస్ చేయి పడితే చాలు టాప్ హీరోల సినిమాలు అన్నీ భారీ ఫ్లాప్ లుగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి.  అయితే ఇప్పటికే పాజిటివ్ టాక్ తో దూసుకు వస్తున్న ‘జనతా గ్యారేజ్’ విషయంలో ఈరోస్ సెంటిమెంట్ ఏమిటి అని జూనియర్ అభిమానులు తల పట్టుకుంటున్నట్లు టాక్.  

ప్రపంచ వ్యాప్తంగా 2000 ధియేటర్లలో విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ కలక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తుంది అని జూనియర్ అభిమానులు కలలు కంటున్న వేళ  వారి ఆశల పై నీళ్ళు జల్లుతూ ఇలా ఈరోస్ రంగ ప్రవేశం చేయడం జూనియర్ అభిమానులకు జీర్ణించు కోలేని నిజంగా మారింది అని అంటున్నారు.   ఇది ఇలా ఉండగా కేరళాలో విడుదల చేయబోతున్న ఈ సినిమా పోస్టర్ల పై మోహన్ లాల్ ఫోటోలు మాత్రమే వేస్తూ ఎక్కడా జూనియర్ ఫోటోను వేయకపోవడం జూనియర్ అభిమానులకు మరింత షాకింగ్ గా మారింది అని అంటున్నారు.

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా మాస్ ప్రేక్షకుల అభిరుచులకు కొంచం దూరంగా కొన్ని విలువలతో ఈ జనతా గ్యారేజ్ నిర్మించారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈరోస్ సెంటి మెంట్ తోడైతే ఈ సినిమా ఫలితంలో ఏమైనా తేడాలు వస్తాయా అన్న భయం జూనియర్ అభిమానులకు పీడకలలా మారింది అని టాక్.

అయితే ఎన్ని నెగిటివ్ సెంటిమెంట్స్ ఈ సినిమాను వెంటాడుతూ ఉన్నా జూనియర్ తన సమర్ధతతో అన్నింటా తానై ‘జనతా గ్యారేజ్’ ని గట్టేక్కిస్తాడని అభిమానులు కొండంత ఆశ పెట్టుకున్నారు.  ఈ సినిమా అనుకున్నట్లుగా విజయం సాధించకపోతే భవిష్యత్ లో విడుదల కాబోయే టాప్ హీరోల సినిమాల మార్కెట్ పై ‘జనతా గ్యారేజ్’ ఫలితం తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంది అన్న మాట వాస్తవం..  


మరింత సమాచారం తెలుసుకోండి: