పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు తిరుపతిలో బహిరంగ సభ పెట్టడంపై ఇటు  ఇండస్ట్రీ పెద్దలు, అటు రాజకీయనాయకులు అంతా చర్ఛలకు ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మనస్సులోని రాజకీయ కార్యచరణని...నేడే బహిర్గంతం చేయనున్నారా? అనేది అందరిలో మధ్య చర్ఛలుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన రాజకీయ సభకి ఎంచుకున్న ముహుర్తం పై పలువురు పలురకాలుగా మాట్లాడుకుంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్ నేడు అనగా..ఆగష్టు 27న తిరుపతిలో తన మొదటి రాజకీయ కార్యచరణని ప్రకటించబోతున్నారు. జనసేస పార్టీ పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీగా కార్యచరణ చేయనుందని ప్రధానంగా వినిస్తుంది. అందుకు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన కార్యకర్తలు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు. అయితే ప్రముఖ రాజకీయ నాయకులు, పవన్ కళ్యాణ్ ఎంచుకున్న ఈ డేట్ తన బ్యాడ్ టైంని సూచిస్తుందని అంటున్నారు.

గతంలో అన్న స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం వేధిక సైతం ఆగష్టు 28న తిరుపతిలో జరిగింది. ఇప్పుడు దానికి ఒక్క రోజు ముందుగా పవన్ కళ్యాణ్ రాజకీయానికి సంబంధించి కీలక సభని తిరుపతిలో ఆగష్టు 27న పెట్టాడు. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ సరైన డైట్స్ ని సెలక్ట్ చేసుకోలేకపోయారు అనేది ఇక్కడ స్పష్టం అవుతుందని రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరూ ఒక్కరే అని ఈ కారణంగా తెలుస్తుందని కూడ కొందరు మాట్లాడుతున్నారు.

భారీ అంచనాలతో వచ్చిన ప్రజారాజ్యం పార్టీ చివరకు కాంగ్రేస్ లో విలీనం చేసి...పార్టీ రూపురేఖలే లేకుండా చేశాడు. ఆ విధంగా ఇప్పుడు జనసేన పార్టీ సైతం అన్న పార్టీని పోలి ఉంటుందని జోస్యం చెబుతున్నారు. అయితే జనసేన పార్టీ అంటే నచ్ఛని వాళ్ళే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతం అన్నదమ్ముల రాజకీయ ప్రసంగాలకు కారణమైన ఆగష్టు 27, 28 డేట్స్  ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: