సామాన్యంగా టాప్ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు ఆ హీరో వీరాభిమానులు ఆ సినిమా ప్రదర్శింపబోయే దియేటర్లను అలంకరించడం అత్యంత భారీ కటౌట్లు లేదా బ్యానర్స్ పెట్టడం పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేయడం లాంటి ఎన్నో పనులు చేస్తూ తమ టాప్ హీరోల పట్ల తమ వీరాభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే ఈ సారి ‘జనతా గ్యారేజ్’ విషయంలో ఈ వీరాభిమానం మరో ముందడుగు వేసింది. 

సామాన్యంగా టాప్ హీరోల అభిమానులు పచ్చబొట్లు పొడిపించుకునే సంస్కృతి తమిళనాడులో కనిపిస్తూ ఉంటుంది.  ఇప్పుడు అలాంటి సంస్కృతి టాలీవుడ్ లో కూడ ప్రవేశించింది.  జూనియర్ ‘జనతా గ్యారేజ్’ టైటిల్ ను ముఖాల పై అదేవిధంగా శరీరంలోని ఛాతి పై పచ్చబోట్టుగా పొడిపించుకుని జూనియర్ అభిమానులు చేస్తున్న హంగామాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి.

ఈ పచ్చ బోట్ల మ్యానియాను చూసి చాలామంది ఆశ్చర్య పడటమే కాకుండా టాలీవుడ్ హీరోల పై పెరిగి పోతున్న క్రేజ్ కు ఇది పరాకాష్టగా మారింది అన్న కామెంట్స్ చేస్తున్నారు.  దీనితో టాప్ హీరోలు అంతా ఒక అరుదైన వ్యక్తిత్వం గల కారణ జన్మలుగా వారికి వారు భావించే విధంగా ఈ వీరాభిమానులు చేస్తున్న హడావిడి వల్ల కనిపిస్తోంది అన్న కామెంట్స్ కూడ వస్తున్నాయి. 

ఈ పరిస్థితులు ఇలా ఉండగా ‘జనతా గ్యారేజ్’ సినిమాకు మొదటిరోజు మొదటి షో నుండి ఎక్కడ డివైడ్ టాక్ లేకుండా పూర్తి పాజిటివ్ టాక్ వచ్చినప్పుడు మాత్రమే ఈ సినిమాకు సంబంధించి జూనియర్ కలలు కంటున్నా 100 కోట్ల మ్యాజిక్ ఫిగర్ వస్తుంది.  అయితే అటువంటి పరిస్థుతులు ఏర్పడతాయా అన్న అనుమాన్ని కూడ కొందరు వ్యక్తపరుస్తున్నారు.   

దీనికి కారణం ప్రస్తుతం నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులుగా ఒక వర్గం జూనియర్ అభిమానులుగా మరో వర్గం చీలిన నేపధ్యంలో కేవలం జూనియర్ అభిమానుల సపోర్ట్ తో ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ విషయంలో 100 కోట్ల సంచలనం సృష్టించడం కష్టం అన్న మాటలు వినిపిస్తున్నాయి.  దీనికితోడు ఈ సినిమా పై ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా ఆ టాక్ ను బాలకృష్ణ అభిమానులు మౌత్ పబ్లిసిటీ గా జనంలోకి తీసుకు వెళ్ళిపోయే అవకాశం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో అత్యంత భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం కత్తిమీద సాము లాంటిదనే అభిప్రాయాన్ని టాలీవుడ్ విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు.  దీనితో జూనియర్ కు ఇంకా రెడ్ ఎలర్ట్ కొనసాగుతూనే ఉంది అని అనుకోవాలి అన్న భావన టాలీవుడ్ లో ఒక వర్గానికి ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: