ఈ మద్య వెండి తెరపై కన్నా బుల్లి తెర లో నటిస్తున్న నటులు, నటీ మణులకు ముఖ్యంగా యాంకర్లు బాగా పాపులర్ అవుతున్నారు. తెలుగు బుల్లితెరపై ఇప్పటికే కొంత మంది యాంకర్లు హాట్ హాట్ గా దర్శనమిస్తూ టాలీవుడ్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.  ఇప్పటి వరకు ‘మా’ టీవీ యాంకర్లలో ఎనర్జిటిక్ యాంకర్ అంటే రవి పేరే ఫస్ట్ చెబుతారు. రవి-లాస్య జంట చేసే అల్లరిని చిన్ని తెర ప్రేక్షకులు బాగానే ఇష్టపడతారు. సినిమా నటులు ముదిరితే టీవీ యాంకర్లు అవుతారన్నది పాత సామెత. ఆ మద్య ఇటీవలే యాంకర్ రవి థ్యాంక్యూ మిత్రమా అనే షార్ట్ ఫిలిమ్ లో హీరోగా నటించాడు.  తాజాగా మరో  యాంకర్ షార్ట్ ఫిలిం లో హీరోగా నటించారు.   క్లాప్ బోర్డ్ ప్రొడక్షన్స్ సంస్థ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘చిరంజీవి’. ఆర్. కె.నల్లం నిర్మించిన  ఈ షార్ట్ ఫిలిమ్ లో యాంకర్ గా ఇప్పటికే మంచి పాపులారిటీ తెచ్చుకున్న రవి హీరోగా నటించారు.

ఈ షార్ట్ ఫిలిమ్ తో యువ ప్రతిభాశాలి నంద కిషోర్ తొలిసారిగా పరిచయమయ్యాడు. సిరివెన్నెల సీతారాయమశాస్త్రి తనయుడు యోగేశ్వర శర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.  ఇప్పటి వరకు  “పరిచయం, థ్యాంక్యూ మిత్రమా, జోక్, నాతిచరామి” లాంటి కంటెంట్ బేస్డ్ షార్ట్ ఫిలిమ్స్ తోపాటు “అయామ్ కార్తీక్, పిట్ట కథ”లాంటి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిలిమ్స్ మరియు “ఓ క్షణం, సఖియా తెలుసా నీకైనా” వంటి హిలేరియస్ అండ్ లవ్లీ షార్ట్ ఫిలిమ్స్ ను రూపొందించి “షార్ట్ ఫిలిమ్ ఇండస్ట్రీలో” తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొన్న “క్లాప్ బోర్డ్” ప్రొడక్షన్స్సంస్థ రూపొందించిన షార్ట్ ఫిలిమ్  “చిరంజీవి”.

ఇక స్టోరీ విషయానికి వస్తే.. నిప్పుతో చెలగాటం, దేవుడితో పరిహాసం తప్పు  అని చెప్పినా వినని వినని ఓ యువకుడు  చివరకు తన తప్పును తెల్సుకొని ప్రశ్చాత్తాపపడ్డ వృత్తాంతమే..రవి నటించిన ‘చిరంజీవి’ షార్ట్ ఫిల్మ్. ఓ తత్త్వాన్ని బోధించిన ఈ షార్ట్ ఫిల్మ్ నెటీజన్లలను అమితంగా  ఆకట్టుకుంటుంది.   శివుడి మాటగా తనికెళ్ల భరణి చెప్పిన మాటలు ఈ షార్టీకి అదనపు బలం…బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టోరీలైన్ కు తగ్గట్టు కుదిరింది. మొత్తానికి లవ్ స్టోరీలపై మొఖం కొట్టేసిన వారికి ఓ తత్త్వాన్ని, జీవితసత్యాన్ని తెల్పిన షార్ట్ ఫిల్మ్ “చింరజీవి”. 


మరింత సమాచారం తెలుసుకోండి: