స్టార్ హీరోలైన సూపర్ స్టార్ మహేష్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు తమ సినిమాలతో సత్తా చూపిస్తున్నారు. అయితే తన సినిమాల విషయంలో అంచనాలకు మించి కన్ ఫ్యూజ్ చేస్తున్న మహేష్ తాజాగా కొరటాల శివతో సినిమా అంటూ ఎనౌన్స్ చేసి తారక్ కు షాక్ ఇచ్చాడు. ఓ దర్శకుడితో పనిచేసిన అనుభవంతో అతనితో చేస్తే ప్రాజెక్ట్ సేఫ్ అనే ఫీలింగ్ వస్తే అతన్ని వెంటనే మరో సినిమాకు ఒప్పించాలని ఉంటుంది. 


ఇక శ్రీమంతుడుతో సూపర్ హిట్ అందుకున్న మహేష్ కొరటాల శివలు మరోసారి కలిసి చేసే ప్రయత్నం కూడా అదే. శ్రీమంతుడు తర్వాత బ్రహ్మోత్సవంతో ఫ్లాప్ ఫేజ్ చేసిన మహేష్ ప్రస్తుతం మురుగదాస్ సినిమా చేస్తున్నాడు. ఇక అది పూర్తయ్యాక మళ్లీ కొరటాల శివకే ఛాన్స్ ఇవ్వడంతో మరో హిట్ ఖాతా తెరచినట్టే అనిపిస్తుంది.


జనతా గ్యారేజ్ టైంలోనే కొరటాల శివతో మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. శివ సినిమా అంటే సేఫ్ అని ఫిక్స్ అయ్యాడు. మరి అలాంటి సేఫ్ ప్రాజెక్ట్ తన వెంటనే మహేష్ చేస్తుండటంతో మహేష్ లక్కీ అని అంటున్నాడట. మహేష్ సినిమా హిట్ అయితే మళ్లీ తారక్ కొరటాలకు అవకాశం ఇచ్చినా ఇచ్చేస్తాడు.   


ఇక మహేష్ కొరటాల శివ సినిమా విషయానికొస్తే మురుగదాస్ తో సినిమా పూర్తయ్యక స్టార్ట్ అయ్యే ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తారని తెలుస్తుంది. అంతేకాదు సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల దాకా ఉంటుందని టాక్. సో కొరటాల శివ మహేష్ ఈసారి మరో పెద్ద ప్రాజెక్ట్ కే నడుం బిగించారన్న మాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: