మెగాస్టార్ 8 ఏళ్ల సుధీర్గ విరామం తర్వాత చేస్తున్న సినిమా ప్రేక్షక హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని తెలుగులో కథ వేట సాగించి అవేవి నచ్చక చివరకు తమిళ కత్తి రీమేక్ గా ఖైది నెంబర్ 150 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిరు టైటిల్ ఏదై ఉంటుందా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు సడెన్ గా ఖైది నెంబర్ 150 అని టైటిల్ పోస్టర్ వేశారు.


అయితే ఈ టైటిల్ తో ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఏర్పడిందని ఎక్స్ క్లూజివ్ టాక్. అందుకే ఖైది నెంబర్ 150 సినిమా టైటిల్ మళ్లీ మార్చబోతున్నారని టాక్. మరి ఓసారి పెట్టి ఎనౌన్స్ చేసిన టైటిల్ మారిస్తే బాగుంటుందా అసలు అభిమానులకు ఈ టైటిల్ నచ్చకపోవడానికి కారణాలు ఏవై ఉంటాయా అంటే.. ఆల్రెడీ ఖైది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరు మళ్లీ ఖైది నెంబర్ 786 సినిమా కూడా తీశాడు.


ఇక ఇప్పుడు కత్తి రీమేక్ గా వస్తున్న ఈ టైటిల్ కూడా ఖైది నెంబర్ 150 అని పెట్టారు. టైటిల్ ఏలా ఉండబోతుంది అన్న ఆడియెన్స్ ఎగ్సైట్మెంట్ కు రొటీన్ టైటిల్ తో డిసప్పాయింట్ చేశారని కొందరి టాక్. అందుకే ఈ అంశాలన్ని పరిగణలో తీసుకుని ఖైది నెంబర్ 150 టైటిల్ ను మార్చబోతున్నారని టాక్. 


అయితే ఇది అఫిషియల్ న్యూసా లేక రూమరా అన్నది మరికొద్దిరోజుల్లో తెలుస్తుంది. ఖైది నెంబర్ 150 టైటిల్ ఎలా ఉన్నా బర్త్ డే నాడు చిరు ఫస్ట్ లుక్ మాత్రం కేక పెట్టించేస్తుంది. ఇన్ని సంవత్సరాలవుతున్నా తనలోని ఆ గ్రేస్ అలానే ఉంది అని చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అరుపులు పెట్టించేశాడు. వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రాం చరణ్ నిర్మిస్తున్నాడు.


ఇక శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో హీరోయిన్ కాజల్ కూడా ఈమధ్యనే సెట్స్ లో జాయిన్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను అనుకున్న టైంలో ఫినిష్ చేసి సంక్రాంతి బరిలో దించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: