సూపర్ స్టార్ మహేష్ అంటే సౌత్ ఇండియన్ సినిమాలో ఎంత క్రేజ్ అన్నది మనకు తెలిసిందే. ఇక మహేష్ నటించిన ఎన్నో సినిమాలు మిగతా భాషల్లో ముఖ్యంగా తమిళ భాషలో రీమేక్ అవడం జరిగింది. స్వతహాగా రీమేక్ లు నచ్చని మహేష్ తన సినిమా రీమేక్ లను చూసి ఎంజాయ్ చేస్తుంటాడు. ఇక స్టార్ క్రేజ్ ఉన్న మహేష్ పై వస్తున్న రూమర్లను కూడా మహేష్ భలే ఎంజాయ్ చేస్తాడు.


ప్రస్తుతం కోలీవుడ్ అంతా మహేష్ గురించి హాట్ టాపిక్ నడుస్తుంది. మురుగదాస్ డైరక్షన్లో సినిమా చేస్తున్న మహేష్ అక్కడ వారిని ఈసారి టార్గెట్ చేశాడు. ఇక అది కాకుండా సుందర్ సి చెబుతున్న ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీలో మహేష్ ను అడిగారని కాని మహేష్ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కాదన్నారని న్యూస్ ఎప్పుడో వచ్చింది.


కాని కోలీవుడ్ లో మాత్రం సుందర్ సి సినిమాలో మహేష్ చేస్తున్నాడని న్యూస్ హల్ చల్ చేస్తుంది. ముందు తమిళ స్టార్ హీరోలు సూర్య, విజయ్ లతో సినిమా తీసేందుకు ప్రయత్నించిన సుందర్.. వారు కాదనడంతో మహేష్ ను అడిగాడు మన సూపర్ స్టార్ కూడా కాదన్నాడు కాని కోలీవుడ్ మీడియా మాత్రం ఓ రెండు రోజుల నుండి మహేష్ సుందర్ సినిమా చేస్తున్నట్టు హడావిడి చేస్తున్నారు.


ఇక ఇద్దరు హీరోలు ఉండాల్సిన ఈ సినిమాలో మరో హీరోగా జయం రవి సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమన్నది తెలియాలి. ఇప్పటికే మురుగదాస్ సినిమా తర్వాత కొరటాల శివతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు మహేష్. ఇక పూరి, వంశీ పైడిపల్లి, విక్రం కె కుమార్ ఇలా మహేష్ కోసం ఎదురుచూస్తున్న దర్శకుల లిస్ట్ పెద్దగానే ఉంది.


మరి ఇలాంటి టైంలో భారీ బడ్జెట్ అంటూ చెబుతున్న సుందర్ సినిమాలో మహేష్ చేసే అవకాశం ఏమాత్రం లేదనిపిస్తుంది. ఇక ఇవన్ని ఏమి పట్టించుకోని మహేష్ ప్రస్తుతం చేస్తున్న మురుగదాస్ సినిమా మీదే తన ఫుల్ ఫోకస్ పెట్టేశాడు. బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో కాస్త నిరాశ చెందిన మహేష్ మురుగదాస్ సినిమాతో ఆ కసి తీర్చుకోబోతున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: