నాలుగు సంవత్సరాల వయస్సులో తండ్రిని పోగొట్టుకుని అనుక్షణం పరిస్తుతులతో పోరాడీ టాప్ యాంకర్ స్థానాన్ని అందుకుంది ఉదయభాను.  మరి కొద్దిరోజులలో కవలలుకు తల్లి కాబోతున్న ఉదయభాను ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలను అదేవిధంగా తన వ్యక్తికత జీవితంలోని అనేక విషయాలను షేర్ చేసుకుంది ఉదయభాను.

ఇదే సందర్భంలో ఈ ఇంటర్వ్యూను నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధి ఒక ఆశ్చర్యకర ప్రశ్న వేసింది.  ‘గ్లామర్ ఫీల్డ్ లో ఉన వాళ్ళు అంటే చిన్నచిన్న చూపు ఉంటుంది.  ఆ వ్యంగ్య ధోరణిని తట్టుకుని ఎలా నిలబడగలిగారు ?’ అన్న ప్రశ్నకు ఉదయభాను చాల విలక్షణమైన సమాధానం ఇచ్చింది. 

ఒక యాంకర్ గా పబ్లిక్ లోకి వెళ్ళినప్పుడు కొంతమంది జనం వెకిలి శబ్దాలు చేస్తూ మీద పడటానికి ట్రై చేస్తారని అలా చేసే వాళ్ళలో బాగా చదువుకున్న వాళ్ళను కూడ తాను చూశానని అంటూ వీరికి చదువు వల్ల కనీస సంస్కారం అబ్బ లేదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు ఫ్లైట్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే చాలామంది ఎగాదిగా చూస్తూ ఉంటారని అంటూ ఒకసారి తాను ఈ పరిస్థితి భరించలేక ఒక పెద్ద వ్యక్తితో ‘కొంచం తల తిప్పుకోవయ్యా బాబు’ అంటూ జోక్ చేసానని అన్న విషయాన్ని బయట పెట్టింది ఉదయభాను. 

వృత్తి పరమైన పోటీతో అసూయ తనంతట అదే ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకు వస్తుందని ఈ అసూయ వల్ల రకరాకాల రూమర్స్  ప్రచారంలోకి వస్తాయని వీటి గురించి పట్టించుకునే కంటే వాటిని పట్టించుకోక పోవటం బెటర్ అని అంటూ తనకు ఇండస్ట్రీలో స్నేహితులు పెద్దగా లేరు అన్న విషయాన్నీ బయట పెట్టింది ఉదయభాను.  

ఎదుటి వ్యక్తి మనకు సహాయం చేయకపోయినా మన ఎదుగుదల చూసి ఏడవకుండా ఉంటే చాలు అని తాను ఆలోచిస్తానని అయితే మనం ఆలోచించినట్లు ఎదుట మనుష్యులు ఆలోచించరు కదా అంటూ సెటైర్లు వేసింది ఉదయభాను. ‘లీడర్’ సినిమాలో తాను ఐటమ్ సాంగ్ చేసిన తరువాత తనకు సుమార్ 25 సినిమాలలో ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చాయని అయితే తనకు యాంకర్ గా కొనసాగడమే ఇష్టం కాబట్టి వాటిని వదులుకున్నాను అని చెపుతోంది ఉదయభాను.

తనకు అందరూ అనుకుంటున్నట్లుగా అవకాశాలు తగ్గిపోలేదని మరి కొంత కాలం బ్రేక్ తీసుకుని యాంకర్ గా మళ్ళీ బుల్లి తెర పై తన హవాను కొనసాగిస్తాను అని చెపుతున్న ఉదయభాను త్వరలో ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టబోతున్నాను అన్న విషయాన్ని బయట పెట్టింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: