టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ముదురు హీరోల సంఖ్య ఎక్కువుగా ఉన్నప్పటికీ...వారి కంటే ముందుగా యంగ్ డైరెక్టర్స్ పెళ్ళి బాట పట్టారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్స్ ఇప్పుడు వరుసగా పెళ్లిళ్లు చేసుకోవటం విశేషంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, కొద్ది రోజుల క్రితమే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ క్రిష్ పెళ్ళి పీటలు ఎక్కారు.


ఎప్పటి నుండో క్రిష్ ని పెళ్ళి చేసుకోవాల్సిందిగా ఇంట్లో ఒత్తిడి తీసుకువస్తున్నప్పటికీ...అందుకు క్రిష్ దూరంగా ఉంటూ వచ్చారు. గమ్యం మూవీ తరువాత క్రిష్ కి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్న పేరెంట్స్, ఎట్టకేలకు ఈ సంవత్సరంలో పెళ్లి చేశారు. దీంతో క్రిష్ వివాహజీవితాన్ని ప్రారంభించాడు. ఇదిలా ఉంటే మరో డైరెక్టర్ హను రాఘవపూడి సైతం పెళ్లి చేసుకున్నారు. ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనదైన మార్క్ సృష్టించుకున్న హను రాఘవపూడి పెళ్ళి చేసుకొని ఓ ఇంటివాడయారు.


ఇదిలా ఉంటే మరో స్టార్ డైరెక్టర్ విక్రమ్ సైతం ప్రస్తుతం పెళ్లికి రెడీ అవుతున్నారు. ‘ఇష్క్, మనం, 24’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న ‘విక్రమ్ కుమార్’ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నైకు చెందిన శ్రీనిధి అనే అమ్మాయితో ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం సెప్టెంబర్ 4న జరగనుంది.


ఇక వీరుకాక టాలీవుడ్ కి చెందిన మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ సైతం పెళ్లి చేసుకునేందుకు సిధ్ధంగా ఉన్నారు. ఇప్పటికే వారికి అమ్మాయిని వెతికే పనిలో ఉన్నట్టుగా ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం. ముదురు హీరోలకి ఈ సంవత్సరం పెళ్లిళ్లు అవుతాయని అందరూ అనుకున్నారు కానీ... అనుకోని విధంగా డైరెక్టర్స్ పెళ్లి చేసుకోవటం ఇండస్ట్రీ వారికి ఆశ్ఛర్యాన్ని ఇస్తుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: