వెండి తెర మన్మధుడుగా టాలీవుడ్ లో గత 30 సమ్వత్సరాలుకు పైగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నాగార్జున ఈరోజు తన 57వ పుట్టినరోజునాడు ఒక అతి విలువైన బహుమతిని అమ్డుకోబోతున్నాడు.  నాగచైతన్య అఖిల్ లు ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఒక స్పెషల్ పోస్టల్ స్టాంప్ ను ఈరోజు విడుదల చేస్తున్నారు.

‘నిర్మలా కాన్వెంట్’  లో సింగర్ గా అవతారం ఎత్తిన నాగార్జున ఫోటోను ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ తాజ్ మహల్ పై విడుదల చేసిన పోస్టల్ స్టాంప్ పక్కన తమ తండ్రి నాగార్జున ఫోటోను పెట్టి ఒక స్పెషల్ పోస్టల్ స్టాంప్ గా డిజైన్ చేయించి నాగార్జున తాజ్ మహల్ అంత గొప్పవాడు అన్న సంకేతాలు ఇస్తూ ఈ పోస్టల్ స్టాంప్ డిజైన్ ను నాగ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసారు.

ప్రతిభను ప్రోత్సహించి కొత్తదనాన్ని ప్రోత్సహించే మనస్థత్వం నాగార్జునది.  అందుకే మూడు దశాబ్దాలు దాటి పోయినా నాగార్జున ముఖం తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టలేదు.  ఒకే తరహా పాత్రలకు కథలకు నాగార్జున ఎప్పుడూ పరిమితం కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేస్తూనే వచ్చాడు.  

ఒకవైపు రొమాంటిక్ సినిమాలు చేస్తూ ‘శివ’ లాంటి ట్రెండ్ సెటర్ సినిమాలో నటించడంతో పాటు అలనాటి అన్నమయ్య నుండి నేటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు భక్తి పాత్రలు చేస్తూ జనానికి నచ్చే విధంగా నటించడం ఒక్క నాగార్జునకు మాత్రమే చేతనైన విషయం.  శతాబ్దాలు  గడిచి పోతున్నా తాజ్ మహల్ ఒక అద్భుతమైన కట్టడంగా ఎలా మిగిలి పోయిందో తమ తండ్రి నాగార్జున వయసుతో సంబంధం లేకుండా కలకాలం తెలుగు సినిమా రంగంలో నాగార్జున కీర్తి కొనసాగాలి అన్న ఉద్దేశ్యంతో తాజ్ మహల్ పక్కన తమ తండ్రి ఫోటోను పెట్టి పోస్టల్ స్టాంప్ ను డిజైన్ చేయించాము  అని చెపుతున్నారు అఖిల్ చైతన్యలు.

సినిమాలలోనే కాదు వ్యాపార రంగంలో సినిమా నిర్మాణ రంగంలో స్టూడియో నిర్వహణ విషయంలో నాగార్జున ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తన ప్రస్థానాన్ని అన్ని రంగాలలోను విజవంతంగా కొనసాగిస్తున్నాడు.  తన తండ్రి అక్కినేని లాగే రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయ వేత్తల అందరితోను సన్నిహితంగా ఉండే నాగ్ తెలివితేటలు అనుసరించడం చాల కష్టం.

తాను హీరోగా కొనసాగుతూ వరస హిట్స్ అందుకుంటూనే తన పిల్లలు నాగచైతన్య అఖిల్ లను టాప్ యంగ్ హీరోలుగా మార్చాలని ఎంతో కష్టపడుతున్నాడు నాగార్జున. ఇంత వయసు వచ్చినా ఎక్కడా తన గ్లామర్ తగ్గకుండా యంగ్ హీరోలకు సవాల్ విసురుతూ కొనసాగుతున్న నాగార్జున ప్రస్థానంలో నేడు జరుపుకుంటున్న పుట్టినరోజు సందర్భంగా నాగార్జునకు ఎపి హెరాల్డ్ జన్మదిన శుభాకాంక్షలు..



మరింత సమాచారం తెలుసుకోండి: