సస్పెన్స్ కు తెర తొలగిస్తూ ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ కు సమంత ఎంట్రీ ఇచ్చింది.  ఈ సినిమాను జూనియర్ నిత్యామీనన్ లతో సమానంగా తలకెత్తుకుని భారీగా ప్రమోట్ చేయడానికి సమంత దూసుకు వస్తోంది.  జూనియర్ తో సమంత నటించిన ‘బృందావనం’ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో సినిమాలు వచ్చినా అవి హిట్ కాని నేపధ్యంలో ‘జనతా గ్యారేజ్’ బ్లాక్ బస్టర్ హిట్ తో తన సత్తాను మళ్ళీ చాటాలని ప్రయత్నిస్తోంది సమంత.

ఈ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసిన సమంత తన మాటల మధ్యలో మహేష్ ‘బ్రహ్మోత్సవం’ ప్రస్తావన తీసుకురావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.  తన వ్యక్తిగత జీవితం పై వస్తున్న పుకార్లను గురించి మాట్లాడుతూ ఆమె ‘బ్రహ్మోత్సవం’ ప్రస్తావన తీసుకు వచ్చింది.  

‘బ్రహ్మోత్సవం’ సినిమాలో చెప్పినట్లు  మంచి మాటలు మాట్లాడుకుందాం అని ఆమె వ్యాఖ్యానించింది. ‘నా గురించి చాలా గాసిప్స్ ప్రచారం చేస్తున్నారు. అవి నా వ్యక్తిగత జీవితాన్ని వివాదాస్పదంగా మారుస్తున్నాయి. ఇది నాకు చాలా బాధ కలిగిస్తోంది. అయితే చర్చించడానికి దేశంలో చాలా మంచి విషయాలున్నాయి. అవి అన్నీ వదిలి కొందరు పనికట్టుకుని నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

అంతేకాదు మంచి విషయాల గురించి ఎన్ని సార్లైనా మాట్లాడుకోవచ్చు.  అయితే పనికట్టుకుని ఎదుటి మనిషిని విమర్శిస్తూ వారి జీవితాల పై రూమర్స్ ప్రచారం చేస్తూ రోజులు గడపడం వల్ల జనానికి వచ్చే ప్రయోజనం ఏమిటో తనకు అర్ధం కావడం లేదు అంటూ తన పై రూమర్స్ ప్రచారం చేస్తున్న వారికి షాక్ ఇచ్చింది సమంత.  

ఇదే సందర్భంలో సమంత మాట్లాడుతూ మంచి విషయాల గురించి చర్చిస్తే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. అవి ఆరోగ్యానికి మంచిది అని అంటూ మంచి విషయాల గురించే చర్చించేలా ఎవరికి వారు ప్రమాణం చేద్దాం  అంటూ తనలోని భావాన్ని బయట పెట్టింది సమంత.

దీనితో ‘బ్రహ్మోత్సవం’ విడుదల అయ్యాక మహేష్ ఆ సినిమా గురించి ఒక్క మాట కూడ మాట్లాడక పోయినా సమంత ఆ సినిమాలో మంచి పోయింట్ ను తాన ‘జనతా గ్యారేజ్’ తో కలిపి బాగానే ప్రచారం చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.  ఇది ఇలా ఉండగా నిన్న భాగ్యనరంలో జరిగిన ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ఇంట్లో జరిగిన వివాహ వేడుకలకు సమంత నాగచైతన్యతో కలిసి ఆ ఫంక్షన్ కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.  ఆ వివాహ వేడుకలలో నాగార్జున సమంతను ఆ కార్యక్రమానికి వచ్చిన అతిధులు అందరికీ తనకు కాబోయే కోడలు అంటూ పరిచయం చేయడంతో సమంత నాగాచైతన్యల పెళ్ళి విషయం పై నాగార్జున అధికారికంగా ప్రకటించాడు అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: