బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించిన ప్రియాంకా చోప్రా ఇప్పుడు హాలీవుడ్ స్టార్ అయ్యింది. క్వాంటికో సీరీస్ లతో రెచ్చిపోతున్న అమ్మడు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలను పట్టించుకునే పరిస్థితిలో లేదు. ఇక వాణిజ్య ప్రకటనలకైతే ప్రియాంకా చెప్పే రేట్లు దిమ్మతిరిగి పోతుంది. రీసెంట్ గా అస్సాం టూరిజం క్యాంపెయిన్ కు ప్రచార కర్తగా ఉండేందుకు ప్రియాంకాను అడిగారట.


అయితే ఆ ప్రోగ్రాం చేసేందుకు అమ్మడు 15 కోట్ల దాకా డిమాండ్ చేసిందట. ప్రియాంకా చోప్రా చెప్పిన ఫిగర్ విన్న అస్సాం టూరిజం షాక నోటమాట రాలేదట. ప్రియాంకా ఇచ్చిన షాక్ కు వారు తేరుకునేందుకు కొద్దిగా టైం కూడా పట్టిందట. సెలబ్రిటీస్ సమాజానికి ఉపయోగపడే విషయాల్లో స్వతహాగా రావాలి. ఏదో వారి సాటిస్ ఫ్యాక్షన్ కోసం ఎంతో కొంత ఇద్దాం అనుకుంటే వారేమో ఆకాశానికంటే రేట్లతో బెంబేలెత్తిస్తున్నారు.       


బీ టౌన్ ఆడియెన్స్ లో ప్రియాంకా చోప్రా అంటే సెపరేట్ క్రేజ్.. అందం అభినయంతో ప్రియాంకా చోప్రా చేసే సినిమాలన్ని మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. ఇక హాలీవుడ్ సీరియల్ క్వాంటికో పార్ట్ 1లో రెచ్చిపోయిన ప్రియాంకా బ్యూటీ ఇప్పుడు రెండో సీరీస్ లో కూడా అదరగొట్టేస్తుంది. మరి ఇక్కడ క్రేజ్ తో అక్కడ హవా కొనసాగిస్తున్న అమ్మడు అదే రేంజ్లో రెమ్యునరేషన్ కూడా అడుగుతుంది.


అయితే ప్రభుత్వానికి సంబందించిన కార్యక్రమం కాబట్టి ప్రియాంకా చోప్రా మరోసారి అస్సాం టూరిజం క్యాపెనియన్ పై ఆలోచిస్తుందట. ఫ్రీగా చేసేంత అవసరం లేదు కాని వారి బడ్జెట్ లో ఆమెను ఒప్పించి ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చూస్తున్నారు. మరి ప్రియాంకా ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: