సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా ఇక్కడ స్టార్ రేంజ్ ఉన్నా సరే ఒకే ఒక్క బాలీవుడ్ ఆఫర్ రావడంతో అక్కడకు మఖాం మార్చేసింది. బీ టౌన్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించలేని ఇల్లి బేబ్ ఈ మధ్యనే అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన రుస్తం సినిమాతో హిట్ అందుకుంది.


ఇక ఆ హిట్ ఇచ్చిన కిక్ తో మరో రెండు భారీ అవకాశాలు కూడా అందుకుంది లేండి. అయితే కెరియర్ పీక్స్ లో ఉన్నా తన మీద వచ్చిన కామెంట్స్ కు ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్నని చెప్పుకొచ్చింది ఇలియానా. ముఖ్యంగా తన ఫిగర్ మీద కామెంట్ రావడం తన మనసుని గాయపరచాయని. సన్నగా ఉన్న తనకు యద అందాలు అంతగా ఆకట్టుకోవని పచ్చిగానే మాట్లాడేసింది.


ఇక ఇలాంటి కామెంట్స్ విని విని విసుగొచ్చేసిన ఇలియానా ఇప్పుడు తన మీద ఎలాంటి హాట్ కామెంట్స్ చేసినా పెద్దగా పట్టించుకోవట్లేదని చెప్పేసింది. తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోలకు పర్ఫెక్ట్ జోడి అనిపించుకున్న ఇలియానా ఆ తర్వాత బీ టౌన్ లో స్టార్స్ తో అటుంచితే అసలు అవకాశాలే లేకుండా పోయాయి. 


అయినా సరే ఓపికతో అక్కడ అవకాశాల కోసం ట్రై చేసిన ఈ అమ్మడు రీసెంట్ రుస్తం హిట్ తో మళ్లీ ఫాంలోకి వచ్చింది. ఇక నుండి అమ్మడి బాలీవుడ్ కెరియర్ మరింత జోరుగా కొనసాగుతుందని చెప్పొచ్చు. మొన్నటిదాకా సౌత్ సినిమాల మీద హోప్స్ పెట్టుకున్న ఇలియానా ఇక్కడ అవకాశాలు రాకపోయే సరికి మళ్లీ బీ టౌన్ లోనే తానేంటో ప్రూవ్ చేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: