స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టామినా ఏంటో ఆ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ కలక్షన్స్ ను చూస్తే అర్ధమవుతుంది. సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటూ వరుస హిట్స్ తో స్టార్ హీరోలకు వణుకు పుట్టిస్తున్న అల్లు అర్జున్ రీసెంట్ గా వచ్చిన సరైనోడుతో రికార్డుల చెడుగుడు ఆడేశాడు. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు బోల్తా పడితే బన్ని సరైన టైంలో సరైనోడుతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమా అల్లు అరవింద్ నిర్మించారు.


అయితే ఆ సినిమా తర్వాత తమిళ దర్శకులతో సినిమా చేస్తాడు అనుకున్న బన్ని సడెన్ గా హరీష్ శంకర్ డైరక్షన్లో సినిమాకు కమిట్ అయ్యాడు. ఇక సినిమా టైటిల్ కూడా దువ్వాడ జగన్నాథం అని పెట్టేశారు. ఈరోజు ముహుర్తం పెట్టిన సినిమా సెప్టెంబర్ మొదటి వారం నుండి రెగ్యులర్ షూట్ జరుపుకోనుంది. అయితే ఈసారి కూడా బన్ని మళ్లీ సమ్మర్ టార్గెట్ పెట్టాడు. బన్ని సమ్మర్ అంటే ఆ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టేస్తుందని ఫ్యాన్స్ ఫిక్సయ్యారు. ఇక బన్ని సమ్మర్ రిలీజ్ తో మిగతా హీరోలకు కూడా కాస్త షివరింగ్ మొదలైంది.  


ఇప్పటికే స్టార్ హీరోల సినిమాల మధ్య జరుగుతున్న ఈ పోటీ సమ్మర్ షేర్ ఖాన్ గా బన్ని తన బలాన్ని చూపిస్తున్నాడు. హరీష్ శంకర్ కూడా బన్ని హీరోయిజానికి సరితూగే కథతోనే సిద్ధమయ్యాడట. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా బన్ని రేంజ్ మరింత పెంచేదిగా ఉంటుందని అంటున్నారు. మెగా హీరోల్లో ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్న బన్ని సినిమా కోసం ఎంతటి రిస్క్ తీసుకుంటాడో అందరికి తెలిసిందే. ఇక తను ఆ మాత్రం కష్టపడతాడు కాబట్టే రిజల్ట్ కూడా అదే రేంజ్లో వస్తుంది.


సినిమా ముహుర్తం పెట్టేశారు కాని హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి ఇంకా ఎనౌన్స్ చేయలేదు. సుబ్రమణ్యం ఫర్ సేల్ తర్వాత హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మీద ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. మరి వరుస హిట్లతో హోరెత్తిస్తున్న బన్ని దువ్వాడ జగన్నాథంతో ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: