సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తోనే సినిమా షురూ చేసిన పవన్ కళ్యాణ్ ముందు కాస్త దూకుడు చూపించినా మధ్యలో దర్శకులు మారడంతో మళ్లీ లేట్ అవడం జరుగుతుంది. ఎస్.జె సూర్య ఎక్సిట్ డాలి ఎంటర్ తో కసత గజిబిజిగా మారిన యూనిట్ ఇప్పుడు అంతా సెట్ రైట్ చేసుకుని షూటింగ్ చేస్తుంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ సినిమా టైటిల్ గా 'కాటమ రాయుడా' అని పెట్టబోతున్నారట. ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమాలో పవన్ ఆలపించిన ఆ సాంగ్ లిరిక్ నే ఇప్పుడు టైటిల్ గా పెడుతున్నారు.


శరత్ మరార్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తుంది. అయితే ఈ సినిమా డేట్స్ విషయంలో కూడా శృతి చిత్రయూనిట్ ను ఇబ్బంది పెడుతుందని టాక్. పవన్ సినిమా అంటే ఆ క్రేజే వేరు అంతేకాదు సినిమా టైటిల్ తోనే ట్రెండ్ సృష్టించే పవర్ స్టార్ టైటిల్ అంటే ఇంకా క్రేజ్ అందుకే ఇన్నాళ్లు పవన్ సినిమాకు ఏ టైటిల్ పెడదామా అని ఆలోచించిన యూనిట్ ఇప్పుడు కాటమ రాయుడా అని ఫిక్స్ చేశారట. అయితే టైటిల్ గా కొన్ని పరిశీలణలో పెట్టినా ఫైనల్ గా దీనికే ఓటేశారు.


అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను డాలి తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్ తో తెరకెక్కిస్తున్నాడు. గోపాల గోపాల సినిమా టైంలో డాలికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలోనే పవర్ స్టార్ ఈ సినిమా నుండి సూర్య బయటకు వెళ్లగానే డాలికి పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. ఇక ఇన్నాళ్లు రీమేక్ కథలను డైరెక్ట్ చేసి హిట్ అందుకున్న డాలి మొదటిసారి స్ట్రైట్ కథతో వస్తున్నాడు. ఆకుల శివ కథ అందించగా తన స్క్రీన్ ప్లేతో సినిమా నడిపిస్తున్నాడట.


ఇక సర్దార్ సినిమా సరిగా ఆడకపోవడంతో తన ఫొకస్ అంతా సినిమా హిట్ కొట్టేందుకే పెట్టాడు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నా అందులో పవన్ లేని పార్ట్ షూట్ జరుగుతుంది. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూట్లో పాల్గొననున్నారు. ఓ పక్క పొలిటికల్ మీటింగ్స్ తో బిజీగా ఉంటున్నా మరో పక్క కమిట్ అయిన సినిమా కంప్లీట్ చేసేందుకు పవన్ పర్ఫెక్ట్ షెడ్యూల్ ఫాలో అవుతున్నారట. ఇక ఈ సినిమా పూర్తయ్యక మాటల మాత్రికుడు త్రివిక్రంతో మరో సినిమా ఉంటుందని తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: