తెలుగు ఇండస్ట్రీలో దేవదాసు లాంటి ఎవర్ గ్రీన్ చిత్రాన్ని అందించిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు వారసత్వపు హీరోగా నాగార్జున విక్రమ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రొమాంటిక్ చిత్రాలు, మాస్, క్లాస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అంతే కాదు ఇంత మోడ్రన్ కాలంలో కూడా భక్తిరస చిత్రాలు అన్నమయ్య, రామదాసు, షిరిడీ సాయి లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించి మెప్పించారు.

ఈయన తర్వాత సుమంత్, సుశాంత్ హీరోలుగా వచ్చారు కానీ సక్సెస్ కాలేదు. తర్వాత నాగార్జున తనయుడు నాగచైతన్య కాస్త పరవాలేదు అనిపిస్తున్నాడు. ఈ మద్య అఖిల్ చిత్రంతో చిన్న కుమారుడు అఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.

తాజాగా సుమంత తన చిన్న నాటి జ్ఞాపకాలు పోస్టుచేసిన సందర్భంగా తన మామయ్య నాగార్జున తనను ఎత్తుకున్న ఫోటో ఒకటి ట్విట్ చేశారు. తన మావయ్య బర్త్ డే పురస్కరించుకుని సుమంత్ ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కింగ్ నాగార్జునకు బర్త్ డే విషస్ చెప్పాడు.  ఇప్పుడు అది సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ చేస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: